Telugu Global
Andhra Pradesh

టీడీపీ, జనసేన సోషల్‌మీడియా అరాచకం.. ట్రోలింగ్స్‌ తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన‌ గీతాంజలి గృహిణి, ఆమె భర్త బాలచంద్ర బంగారం పని చేస్తుంటారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిత నాలుగో తరగతి, చిన్న కుమార్తె రిషిక ఒకటో తరగతి చదువుతున్నారు.

టీడీపీ, జనసేన సోషల్‌మీడియా అరాచకం.. ట్రోలింగ్స్‌ తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
X

ఏపీలో దారుణం జరిగింది. తెలుగుదేశం, జనసేన సోషల్‌మీడియా ట్రోల్ చేయడంతో.. గీతాంజలి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన గీతాంజలి.. టీడీపీ, జనసేన మితిమీరిన ట్రోలింగ్ కారణంగా మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుంది. గీతాంజలి ఆత్మహత్య ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

అసలు ఏం జరిగింది.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన‌ గీతాంజలి గృహిణి, ఆమె భర్త బాలచంద్ర బంగారం పని చేస్తుంటారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిత నాలుగో తరగతి, చిన్న కుమార్తె రిషిక ఒకటో తరగతి చదువుతున్నారు. తెనాలిలోని ఇస్లాంపేటలో వీరు నివసిస్తున్నారు. గీతాంజ‌లి పెద్ద కుమార్తెకు నాలుగు సార్లు అమ్మ ఒడి వచ్చింది. ఈమెకు ఇటీవల జగనన్న కాలనీలో ఇంటి స్థలం కూడా వచ్చింది. అయితే ఇటీవల వైసీపీ నిర్వహించిన ఓ సభలో పాల్గొన్న గీతాంజలి.. తనకు జగన్ ప్రభుత్వం ద్వారా వచ్చిన సాయం గురించి మీడియాతో ఉత్సాహంగా మాట్లాడింది. అమ్మఒడి, ఇల్లు పట్టా వచ్చినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.


గీతాంజలి వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ కావడంతో తెలుగుదేశం, జనసేన సోషల్‌మీడియా గ్రూపులు గీతాంజలిపై కక్ష పెంచుకున్నాయి. గీతాంజలి టార్గెట్‌గా సోషల్‌మీడియాలో వేధింపులకు దిగాయి. ఆమెను అసహ్యంగా బూతులు తిడుతూ వీడియోలు చేయడం, కామెంట్స్ పెట్టడం చేశాయి. గీతాంజలి మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ చెప్పలేని బూతులు తిట్టాయి రెండు పార్టీల సోషల్‌మీడియా గ్రూపులు. ఈ ట్రోల్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు యత్నించింది. రెండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన గీతాంజలి ఇవాళ తుదిశ్వాస విడిచింది. దీంతో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లి లేని అనాథలయ్యారు. ఇప్పుడు సోషల్‌మీడియాలో జస్టిస్‌ ఫర్ గీతాంజలి హ్యాష్‌టాగ్‌ వైరల్‌గా మారింది. గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయాలని ఇప్పటికే 15 వేలకు పైగా ట్లీట్లు చేశారు నెటిజన్లు.

First Published:  11 March 2024 3:17 PM GMT
Next Story