Telugu Global
Andhra Pradesh

సీఎం వైఎస్ జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఏపీలో ఇప్పటికే కృష్ణపట్నం, గంగవరం పోర్టులను నిర్వహిస్తోంది.

సీఎం వైఎస్ జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. అహ్మదాబాద్ నుంచి గన్నవరంకు ప్రత్యేక విమానంలో వచ్చిన అదానీ.. నేరుగా తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయి. రాత్రికి డిన్నర్ కూడా కలిసే చేస్తారని.. ఆ తర్వాత అదానీ తిరిగి వెళ్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఏపీలో ఇప్పటికే కృష్ణపట్నం, గంగవరం పోర్టులను నిర్వహిస్తోంది. విశాఖపట్నంలో మెగా డేటా హబ్ ఏర్పాటుకు అదానీ గ్రూప్‌కే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సైతం అదానీ గ్రూప్ ప్రతినిధులు హాజరై పలు ప్రాజెక్టులు ఏపీలో చేపట్టడానికి ముందుకు వచ్చారు. ఆనాడు అదానీ గ్రూప్ చేపడతామని హామీ ఇచ్చిన ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పనులను ఖరారు చేయడానికి అదానీ అమరావతి వచ్చినట్లు తెలుస్తున్నది.

వైఎస్ జగన్, గౌతమ్ అదానీ గురించి రాష్ట్రంలో పెట్టుబడుల గురించి లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తున్నది.ఇక అదానీ గ్రూప్‌కు ఏపీ చాలా కీలకంగా ఉన్నది. రెండు పోర్టులతో పాటు పవర్ ప్లాంట్లు, అదానీ విల్మర్ వంట నూనెల పరిశ్రమలు ఏపీలో నిర్వహిస్తోంది. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపే అవకాశం ఉన్నది. అదానీ గ్రూప్ సంస్థల పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. ఇది తప్పకుండా వైసీపీకి మంచి మైలేజ్ ఇస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

First Published:  28 Sept 2023 8:23 PM IST
Next Story