Telugu Global
Andhra Pradesh

ప్రేమికుడిని చెట్టుకు కట్టేసి ప్రియురాలిపై స్నేహితుడి అత్యాచారం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువతీ యువకుడు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. కొంతకాలంగా వీరు సహజీవనం చేస్తున్నారు.

ప్రేమికుడిని చెట్టుకు కట్టేసి ప్రియురాలిపై స్నేహితుడి అత్యాచారం
X

ప్రేమికుడిని చెట్టుకు కట్టేసి ప్రియురాలిపై స్నేహితుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన తిరుపతి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువతీ యువకుడు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. కొంతకాలంగా వీరు సహజీవనం చేస్తున్నారు. సదరు యువకుడికి ఏడుమలై, బాలాజీ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మంగళవారం ఉదయం స‌ద‌రు యువకుడు స్నేహితులతో కలిసి సూళ్లూరుపేటకు వచ్చి మద్యం సేవించాడు.

ఆ రోజు యువకుడి ప్రియురాలి జన్మదినం కావడంతో కొరిడి వద్ద ఉన్న శివాలయం వద్దకు వెళ్దామని స్నేహితులు యువకుడిని కోరారు. దానికి సరేనని చెప్పిన యువకుడు ఆమె విధులు ముగిసిన తర్వాత వెళ్దామని చెప్పాడు. సాయంత్రం యువకుడు తన ప్రియురాలి కోసం సూళ్లూరుపేటలోని వై జంక్షన్ వద్దకు వచ్చి ఎదురుచూస్తుండగా అక్కడికి ఏడుమలై, బాలాజీ కూడా వచ్చారు.

ఆ తర్వాత కొంతసేపటికి యువతి(20) కూడా రావడంతో అందరూ కలిసి కొరిడి శివాలయం వద్దకు బయలుదేరారు. సూళ్లూరుపేట మండల పరిధిలోని పులికాట్ తీరం వద్ద దామరాయ గ్రామ పరిసరాల్లోకి వెళ్లిన తర్వాత ఏడుమలై, బాలాజీ యువకుడి చొక్కా విప్పి ఆ చొక్కాతోనే అతడిని చెట్టుకు కట్టేశారు. బాలాజీ చెట్టు వద్ద కాపలాగా ఉండగా ఏడుమలై యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. జరిగిన ఘటనపై బాధితులు శ్రీహరికోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

First Published:  30 May 2024 1:25 PM GMT
Next Story