అప్పులు తెచ్చి పంచితే మిగిలేది పంచె
ప్రస్తుతం దేశంలో ఉచిత పథకాలపై పెద్ద ఎత్తున చర్చ జరగడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం ఆరోగ్యకరంగా లేవన్నారు. బురదగుంట కంటే చండాలంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు
సంక్షేమ పథకాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. సంపద పెంచకుండా పంచుకుంటూ వెళ్తే చివరకు పంచె మాత్రమే మిగులుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు పంచాలనుకుంటే ముందు సంపదను సృష్టించాలన్నారు. సంపద సృష్టించకుండా అప్పులు తెస్తూ వాటిని పంచిపెడుతూ వెళ్తే చివరకు అనేక ఇబ్బందులు వస్తాయన్నారు.
ప్రస్తుతం దేశంలో ఉచిత పథకాలపై పెద్ద ఎత్తున చర్చ జరగడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం ఆరోగ్యకరంగా లేవన్నారు. బురదగుంట కంటే చండాలంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల తీరు ఎలా ఉందో అందరూ చూస్తున్నారని తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
విశాఖ గీతం డీమ్డ్ వర్శిటీలో మాజీ వీసీ కోనేరు రామకృష్ణారావు పేరున నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన వెంకయ్యనాయుడు.. కోనేరు వీసీగా ఉన్నప్పుడు తాను ఏయూలో విద్యార్థిగా ఉన్నానని చెప్పారు. అప్పుడే తనను చూసి ఈ కుర్రోడు దేశానికి గొప్ప నాయకుడు అవుతాడని ఆయన చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాను ఈ స్థాయికి ఎదగడానికి కోనేరు రామకృష్ణారావు మాటలు ఎంతో స్పూర్తినిచ్చాయన్నారు.