Telugu Global
Andhra Pradesh

చంద్ర‌బాబు, ప‌వ‌న్ హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తున్నారు

చంద్రబాబు ఎప్పుడూ హిందువులకు ఏమీ చేయలేదని, సొంత మామకు గౌరవం ఇవ్వని వాడు హిందువులకు ఎలా గౌరవం ఇస్తాడని ఆయ‌న ప్రశ్నించారు.

చంద్ర‌బాబు, ప‌వ‌న్ హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తున్నారు
X

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. ఢిల్లీలో శుక్ర‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్య‌క్ర‌మాలు, శ్రీ‌వాణి ట్ర‌స్ట్ ద్వారా అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని బాబు, ప‌వ‌న్‌ ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడం లేదని ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడూ హిందువులకు ఏమీ చేయలేదని, సొంత మామకు గౌరవం ఇవ్వని వాడు హిందువులకు ఎలా గౌరవం ఇస్తాడని ఆయ‌న ప్రశ్నించారు.

ప్రజా క్షేత్రంలో పోరాడలేకే..

చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జా క్షేత్రంలో పోరాడ‌లేకే అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నాడ‌ని సుబ్రహ్మణ్య స్వామి దుయ్య‌బ‌ట్టారు. మతపరమైన విషయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోవద్దని, రాజకీయాలకే పరిమితం కావాలని హితవు పలికారు. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ ఎన్నడూ హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌ను ఢీ కొట్టడం అంత సులువు కాదని అన్నారు.

First Published:  15 July 2023 8:22 AM IST
Next Story