రాయపాటి తిరుగుబాటు..చంద్రబాబుకే వార్నింగ్
ఎంపీ టికెట్‌ను లోకల్‌వాళ్ళకి కాకుండా కడపవాళ్ళకి ఇస్తే చూస్తూ ఊరుకోమని, ఓడిస్తామని స్పష్టంచేశారు. అవసరమైతే తాను ఎంపీగా పోటీ చేస్తానని అప్పుడు కడపోళ్ళకి ఎవరు పనిచేస్తారో చూస్తానని ఇచ్చిన వార్నింగ్ పార్టీలో సంచలనంగా మారింది.

రాయపాటి తిరుగుబాటు..చంద్రబాబుకే వార్నింగ్
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. రాయపాటి వ్యాఖ్యలు చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తాడికొండ ఇన్‌చార్జి రాజ్యవర్ధనరావు ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ.. నరసరావుపేట ఎంపీ టికెట్‌ను కడపవాళ్ళకి ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవటంలేదని అందుకనే తన కొడుకు, కూతురికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. అలాగే తాడికొండలో రాజ్యవర్ధనరావుకు టికెట్ ఇస్తే గెలుస్తాడన్నారు. ఎంపీ టికెట్‌ను లోకల్‌వాళ్ళకి కాకుండా కడపవాళ్ళకి ఇస్తే చూస్తూ ఊరుకోమని, ఓడిస్తామని స్పష్టంచేశారు. అవసరమైతే తాను ఎంపీగా పోటీ చేస్తానని అప్పుడు కడపోళ్ళకి ఎవరు పనిచేస్తారో చూస్తానని ఇచ్చిన వార్నింగ్ పార్టీలో సంచలనంగా మారింది.
అసలు రాయపాటి ఇన్నిసార్లు కడప, కడప అని నొక్కి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? తాను పోటీ చేయకూడదని అనుకున్నపుడు టికెట్‌ను చంద్రబాబు ఎవరికిస్తే రాయపాటికి ఎందుకు? ఇక్కడ విషయం ఏమిటంటే రెండు టికెట్లు కావాలని రాయపాటి అడిగితే చంద్రబాబు కుదరదని చెప్పేశారట. అప్పటి నుండి చంద్రబాబుపై మాజీ ఎంపీ బాగా మండుతున్నారు. ఇదే సమయంలో లోక్‌సభ టికెట్ యనమల రామకృష్ణుడు అల్లుడు+కడపలో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు మహేష్ యాదవ్‌కి చంద్రబాబు టికెట్ ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మహేష్ కూడా నరసరావుపేట ప్రాంతంలో రెగ్యులర్‌గా పర్యటిస్తున్నారు. దాంతో టికెట్ల విషయంలో తనకు నో చెప్పటమే కాకుండా కడపవాళ్ళని తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నాలను రాయపాటి తట్టుకోలేకపోయారు. అందుకనే తాజాగా చంద్రబాబుకే వార్నింగ్ ఇస్తూ రాయపాటి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి చంద్రబాబు రియాక్షన్ ఏమిటో చూడాలి.