ఆ పని చేస్తే.. జూ.ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు
గుడ్లవల్లేరు మండలం వేమవరంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాని చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా నానికి జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ మద్దతును తెలియజేశారు.
మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తేనే.. జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నేతలు.. పార్టీని కాపాడుకునేందుకు జూ.ఎన్టీఆర్ కాళ్ల దగ్గరకు వస్తారన్నారు. పెద్ద ఎన్టీఆర్‌ను చంద్రబాబు మోసం చేస్తే.. జూ.ఎన్టీఆర్‌ను I-TDP సోషల్‌మీడియా ద్వారా తిట్టిస్తున్నారన్నారు నాని. తాను పెద్ద ఎన్టీఆర్‌కు భక్తుడినని.. నందమూరి హరికృష్ణ తనకు గురువని.. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆరేనని ధైర్యంగా చెప్తానన్నారు.
గుడ్లవల్లేరు మండలం వేమవరంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాని చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా నానికి జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ మద్దతును తెలియజేశారు. 10 మంది జూ.ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకుని టీడీపీ కార్యక్రమాలకు వెళ్తే.. ఆ పార్టీ కార్యకర్తలు దాడులు చేశారని గుర్తు చేశారు నాని. కానీ చంద్రబాబు, లోకేష్ ఏనాడూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై దాడి చేయొద్దని టీడీపీ కార్యకర్తలకు చెప్పలేదన్నారు. జూ.ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పగ్గాలు అందిననాడే.. ఆయన అభిమానులు ఆ పార్టీకి మద్దతివ్వాలన్నారు నాని.
In a desperate move, #KodaliNani is now resorting to using #JrNTR 's name and photo for his election campaign, addressing so-called 'fans' in special programs.
— Gulte (@GulteOfficial) May 3, 2024
గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో #JrNTR ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న కొడాలి నాని.
ఎన్టీఆర్....… pic.twitter.com/zHMvahjxfU
తనకు ఎన్టీఆర్, వైఎస్సార్ రెండు కళ్లన్నారు నాని. తాను తిరిగే కారుకు ఎన్టీఆర్, వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకొని ధైర్యంగా తిరుగుతానన్నారు. తెలుగుదేశం పార్టీ గౌడ, యాదవ, మత్స్యకార, ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించిందని.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించలేదన్నారు. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ..ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో మెజార్టీ స్థానాలు వారికే కేటాయించారని గుర్తు చేశారు.