రెడ్లనే చూసుకోవాలంటే కుదరదు.. పకోడిగాళ్లు పోతేనే మంచిది
మీడియా సమావేశంలో శ్రీధర్ రెడ్డి కూడా తనకు, తన తమ్ముడికి ఎలాంటి పదవి ఇవ్వలేదని చెప్పారని కొడాలి గుర్తు చేశారు. పదవులే కావాలనుకునే వారు తనకు అవసరం లేదని జగన్ స్పష్టంగా చెబుతున్నారన్నారు.
చంద్రబాబు తరహాలోనే జగన్‌మోహన్ రెడ్డి కూడా సొంత సామాజికవర్గానికి మంత్రి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావించి ఉంటారని, అది సాధ్యం కాకపోయే సరికి ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి కొడాలి నాని. కోటంరెడ్డి కంటే ఎక్కువ సార్లు గెలిచిన శ్రీకాంత్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇలా చెబుతూ పోతే కర్నూలు, కడప జిల్లాల్లో చాలా మంది ఉన్నారని, వారికి కూడా మంత్రి పదవులు రాలేదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే పదవి మాత్రమే ఇవ్వగలను.. దాంతో సంతృప్తి పడితే ఉండు లేదంటే నీ దారి నీవు చూసుకో అని శ్రీధర్ రెడ్డితో జగన్ చెప్పి ఉంటారన్నారు.
మీడియా సమావేశంలో శ్రీధర్ రెడ్డి కూడా తనకు, తన తమ్ముడికి ఎలాంటి పదవి ఇవ్వలేదని చెప్పారని కొడాలి గుర్తు చేశారు. పదవులే కావాలనుకునే వారు తనకు అవసరం లేదని జగన్ స్పష్టంగా చెబుతున్నారన్నారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. అలాంటి తనకే రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేను అంటే మీ ఇష్టం సర్ అని చెప్పేసి తప్పుకున్నానన్నారు. జగన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి వదులుకున్న బాలినేనికి కూడా రెండోసారి మంత్రి పదవి దక్కలేదని.. ఆయన కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారన్నారు.
అలా కాకుండా పదవులే కావాలని వేలాడే గబ్బిల్లాంటి వెధవలు ఓ పది మంది ఉంటే.. వారే ఇప్పుడు బయటకు వెళ్లిపోతారన్నారు. ఇలాంటి వ్యక్తులు ఫోన్లలో మాట్లాడే సోదంతా తలకు స్పీకర్లు పెట్టుకుని జగన్ వింటూ ఉంటారా అని కొడాలి ప్రశ్నించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 23 మంది పకోడిగాళ్లు పోయారని అప్పుడే ఏమీ కాలేదన్నారు. వెళ్లిన నాకొడుకులే ఓడిపోయారన్నారు. జగన్‌మోహన్ రెడ్డి కేవలం రెడ్లను మాత్రమే చూసుకోవాలంటే కుదరదు కదా అని ప్రశ్నించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పి ఉంటారని.. ఆయన వెళ్లినా జగన్‌మోహన్ రెడ్డికి ఊడేది ఏమీ లేదన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏమీ పీకలేని నాకొడుకులు ఇప్పుడు వెళ్లి ఏం చేస్తారు.. ఇలాంటి వాళ్లు పోతేనే పార్టీకి దరిద్రం వదులుతుందన్నారు. ఏదీ ఆశించకుండా పనిచేసే వారే వైసీపీకి కావాలన్నారు. మొత్తం దోచి తమకే పెట్టాలంటే జగన్ వద్ద కుదరదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి కాకపోతే ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకెళ్లండి అంటూ ఎద్దేవా చేశారు. ఈ దేశంలో ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై ఎవరినైనా ఏమైనా పీకగలిగారా అని ప్రశ్నించారు. ఐ ఫోన్ నుంచి ఐఫోన్ కాల్‌ను రికార్డు చేయరాదని ఎవడు చెప్పాడు అని ఫైర్ అయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఆడియో టేపు పంపితే తప్పేంటని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభుత్వంలో భాగం కాదా అని నిలదీశారు. ట్యాప్ చేశారా? రికార్డ్ చేశారా ? అన్నది పక్కన పెడితే టీడీపీ తరపున పోటీ చేస్తా అని ఆ ఆడియో టేపులో మాట్లాడింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే కదా అని ప్రశ్నించారు. జగన్‌మోహన్ రెడ్డి అనే వ్యక్తికి భయం లేదని.. ఆనం, కోటంరెడ్డి, కొడాలి లాంటి పది మంది పకోడి గాళ్లకు భయపడే వ్యక్తి కాదన్నారు.