Telugu Global
Andhra Pradesh

ఆసుపత్రిలో చేరిన కొడాలి

మూడు రోజుల క్రితమే ఆసుపత్రిలో చేరిన నానికి శుక్రవారం రాత్రి ఆపరేషన్ జరిగింది. మరో మూడు రోజులు ఐసీయూలోనే ఉండాలని డాక్టర్లు సూచించినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.

ఆసుపత్రిలో చేరిన కొడాలి
X

మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో కొడాలి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితమే ఆసుపత్రిలో చేరిన నానికి శుక్రవారం రాత్రి ఆపరేషన్ జరిగింది. మరో మూడు రోజులు ఐసీయూలోనే ఉండాలని డాక్టర్లు సూచించినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. తర్వాత మరో మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్చి చేస్తారని సమాచారం. ఆ తర్వాత 15 రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారట.

కొద్ది రోజులుగా కొడాలి మీడియా సమావేశాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కూడా కనబడటం లేదు. మామూలుగా నియోజకవర్గంలో తిరుగుతుండే కొడాలి తిరగటం కూడా తగ్గిం చేశారు. కారణం ఏమిటనేది అప్పట్లో తెలియలేదు కానీ ఆసుపత్రిలో చేరిన తర్వాతే అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరి వైద్యపరీక్షలు చేయించుకున్న తర్వాత కిడ్నీలో రాళ్ళున్న విషయం బయటపడిందట. దాంతో వెంటనే చికిత్స చేయించుకోవాలన్న డాక్టర్ల సూచనకు మాజీ మంత్రి కూడా ఓకే చెప్పటంతో వెంటనే ఆసుపత్రిలో చేరిపోయారు.

ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మరోవైపు గుడివాడలో కొడాలిని ఓడించేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఎన్ని ప్లాన్లు వేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొడాలి రెగ్యులర్ గా నియోజకవర్గంలో తిరుగుతునే ఉన్నారు. తన మద్దతుదారులతో టచ్‌లో ఉండటమే కాకుండా ప్రజలకు కూడా అందుబాటులోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పర్యటనల్లో కాస్త ఇబ్బందులు మొదలైనట్లు సమాచారం.

ఎన్నికలు దగ్గరకు వస్తున్న కారణంగా వెంటనే ఆపరేషన్ చేయించేసుకుంటే ఎన్నికల సమయానికి పూర్తి ఫిట్‌గా ఉండవచ్చన్న కారణంతోనే కొడాలి వెంటనే ఆపరేషన్ చేయించేసుకున్నారు. గుడివాడలో పోటీ చేయటమే కాకుండా పార్టీ తరపున గుంటూరు జిల్లాకు ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. మొత్తానికి నూరు శాతం ఫిట్‌నెస్ కోసమే ఆపరేషన్ చేయించేసుకున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ పర్యటనల్లో జగన్మోహన్ రెడ్డి టార్గెట్‌గా చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం చెప్పటంలో కొడాలి తనవంతు పాత్రను మిస్సవుతున్నారు.

First Published:  19 Nov 2022 12:49 PM IST
Next Story