టికెట్‌పై బాలినేని అనుమానం
నీకు టికెట్ లేదు.. నీ భార్యకు ఇస్తామని జగన్ చెబితే అప్పుడు తానే చేసేది కూడా ఏమీ లేదన్నారు. జగన్ చెబితే తానైనా పోటీ నుంచి తప్పుకోవాల్సిందేనన్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు జగన్ టికెట్ ఇవ్వకపోవచ్చని బాలినేని చెప్పారు. మహిళలకు వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని చెప్పారు. ఆ కోణంలో తనకు టికెట్ రాకపోవచ్చని.. ఒకవేళ తన భార్య సచిదేవికి టికెట్ ఇస్తారేమో చూడాలన్నారు.
నీకు టికెట్ లేదు.. నీ భార్యకు ఇస్తామని జగన్ చెబితే అప్పుడు తానే చేసేది కూడా ఏమీ లేదన్నారు. జగన్ చెబితే తానైనా పోటీ నుంచి తప్పుకోవాల్సిందేనన్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొండేపి వైసీపీ ఇన్‌చార్జ్ వరికూటి అశోక్ బాబు.. పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయన్నారు. కార్యకర్తలను కలుపుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు.
2019లో కొండేపిలో ఓడిపోయామని.. ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదన్నారు. అయితే తనకు టికెట్ ఇవ్వరేమో అని బాలినేని చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం.. జగన్ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పడమేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. బాలినేనికి టికెట్ నిరాకరించే పరిస్థితి ఉండదన్నారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోదరిని బాలినేని వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ బాలినేనికి, సుబ్బారెడ్డి మధ్య రాజకీయంగా విబేధాలున్నాయి.