Telugu Global
Andhra Pradesh

ఎత్తిపోయే రాత ఉన్నప్పుడే జగన్‌కు ఎదురుతిరుగుతాం..

నుదిటి మీద ఎత్తిపోయే రాత ఉన్న వారే జగన్‌ను వ్యతిరేకించి టీడీపీలోకి వెళ్తారని.. ఓడిపోయే రాత ప్రభావంతోనే అలా జరుగుతుందన్నారు. జగన్‌తో ఉంటే ఓడిపోం కాబట్టి ఓడిపోవాలంటే టీడీపీలోకి వెళ్లాల్సిందేనన్నారు.

ఎత్తిపోయే రాత ఉన్నప్పుడే జగన్‌కు ఎదురుతిరుగుతాం..
X

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఎత్తిపోయే రాత ఉన్న వాడే జగన్‌పై తిరుగుబాటు చేసి పక్క పార్టీలోకి వెళ్తారని వ్యాఖ్యానించారు. జగన్‌పై విమర్శలు చేయడం మంచి పద్ధ‌తి కాదన్నారు. ఆయన దయవల్లే అన్ని రకాలుగా బాగుపడి కూడా తిరిగి ఆయన్ను ఆడిపోసుకోవడం మంచిది కాదన్నారు. జగన్‌పై అవతలి వారు కూడా మాట్లాడని మాటలను కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు. వీళ్ల లెక్కలన్నీ దేవుడు సెట్ చేస్తాడని.. ఎవరైతే ఈరోజు ఎగిరెగిరి పడుతున్నారో వారి రాజకీయ జీవితం మరో ఆరు నెలల్లో క్లోజ్ అవుతుందన్నారు. జాతకం చూపించుకున్నా ఆ విషయం తెలుస్తుందన్నారు.

నుదిటి మీద ఎత్తిపోయే రాత ఉన్న వారే జగన్‌ను వ్యతిరేకించి టీడీపీలోకి వెళ్తారని.. ఓడిపోయే రాత ప్రభావంతోనే అలా జరుగుతుందన్నారు. జగన్‌తో ఉంటే ఓడిపోం కాబట్టి ఓడిపోవాలంటే టీడీపీలోకి వెళ్లాల్సిందేనన్నారు. రెండువేల పనులు చేయాలని కోరుకుంటామని.. కానీ అన్ని చేయలేకపోవచ్చని.. దాన్ని పట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. నేతల పిల్లలంతా పెద్దపెద్ద స్కూళ్లలో చదువుతుంటారని.. అలాంటి నేతల్లో కొందరికి జగన్‌మోహన్ రెడ్డి పేద పిల్లలు చదివే ప్రభుత్వ స్కూళ్లను బాగుచేయడం నచ్చడం లేదన్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు స్టేట్ ఫస్ట్‌ రావడం అన్నది ఒక కలగా ఉండేదని.. ఈరోజు జగన్‌మోహన్ రెడ్డి కృషితో ఆ కల నిజమైందన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను మొత్తం రెండు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధారదత్తం చేశారని అనిల్ విమర్శించారు.

First Published:  11 May 2023 8:26 AM IST
Next Story