చంద్రబాబు బదులు రమేష్ జైలుకు పోతాడా?
అధికారుల తప్పులకు చంద్రబాబును అరెస్టు చేయటాన్ని ఆయన ఖండించటం బాగానే ఉంది. అధికారులను ఎందుకు బాధ్యులను చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాబట్టి ఐవైఆర్, రమేష్‌ను కూడా సీఐడీ అరెస్టు చేయాలి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబునాయుడి అరెస్టుకు సంబంధించి పీవీ రమేష్ విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కుంభకోణంలో చంద్రబాబు అరెస్టు హాస్యాస్పదమన్నారు. ఎల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలొ మాట్లాడుతూ.. అధికారులు చేసిన తప్పులకు చంద్రబాబును బాధ్యుణ్ణి చేయడం చాలా విచిత్రంగా ఉందన్నారు. సరైన ఆధారాలు లేకుండానే చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందన్నారు. తానిచ్చిన వాగ్మూలం ఆధారంగానే చంద్రబాబును అరెస్టు చేయటాన్ని తాను అంగీకరించనన్నారు. వాస్తవ ఫైల్స్ లేకుండా చంద్రబాబుపై పెట్టిన కేసు నిలవదని అభిప్రాయపడ్డారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రమేష్ చాలా ఎక్కువగా మాట్లాడినట్లున్నారు. ఎందుకంటే రమేష్ వాగ్మూలం ఆధారంగానే చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ ఎక్కడా చెప్పలేదు. పైగా అధికారుల తప్పులకు చంద్రబాబును బాధ్యుడిని చేయటం ఏమిటని ప్రశ్నించారు. మరి ఈ కుంభకోణంలో అప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన తాను బాధ్యత వహిస్తారా? అధికారుల తప్పులకు చంద్రబాబును అరెస్టు చేయటాన్ని ఆయన ఖండించటం బాగానే ఉంది. అధికారులను ఎందుకు బాధ్యులను చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాబట్టి ఐవైఆర్, రమేష్‌ను కూడా సీఐడీ అరెస్టు చేయాలి.
మరి 2009లో జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్టు చేశారు. అక్రమార్జాన కేసుల్లో జగన్‌తో పాటు కొందరు అధికారులను కూడా అరెస్టు చేశారు కదా? జగన్‌ను అరెస్టు చేయటం తప్పని రమేష్ అప్పుడు ఎందుకు చెప్పలేదు? అలాగే ఇప్పుడు చంద్రబాబుతో పాటు ఐవైఆర్, రమేష్‌తో పాటు మరికొందరిపైన కేసులు పెడితే రమేష్‌కు ఓకేనేనా? ముఖ్యమంత్రి అన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టే సీఐడీ చంద్రబాబు మీద కేసులు పెట్టి అరెస్టు చేసింది.
సీమెన్స్ కంపెనీ నిధులు విడుదల చేయకుండానే ప్రభుత్వం రూ.371 కోట్లు విడుదల చేయకూడదని ఐవైఆర్, తాను అభ్యంతరం చెప్పింది అబద్ధమని రమేష్ చెప్పదలిచారా? చంద్రబాబు ఒత్తిడితోనే తాము నిధులు విడుదల చేస్తున్నట్లు రమేష్ నోట్ ఫైల్‌లో రాసింది అబద్ధమా? అధికారుల తప్పులను నాయకులకు ఆపాదిస్తే వ్యవస్థ కుప్పకూలిపోతుంది అని అంటున్న రమేష్ జరిగిన కుంభకోణానికి తాను కూడా బాధ్యత వహిస్తే అంతకన్నా కావాల్సిందేముంటుంది.