Telugu Global
Andhra Pradesh

కిరణ్ వల్ల ఏమన్నా ఉపయోగముందా?

ఒక మాజీ ముఖ్యమంత్రి తమ పార్టీలో చేరారని చెప్పుకునేందుకు తప్ప కిరణ్ చేరిక బీజేపీకి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. తన నియోజకవర్గంలో తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు. పీలేరులో తమ్ముడి మీద గట్టి అభ్యర్థిని పోటీలోకి దింపి కిరణ్ బీజేపీని గెలిపించుకుంటే అదే పది వేలు.

కిరణ్ వల్ల ఏమన్నా ఉపయోగముందా?
X

ఇప్పుడు ఈ విషయంపైనే పార్టీతో పాటు చిత్తూరు జిల్లాలో చర్చ బాగా జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరటం కిరణ్‌కు చాలా అవసరం. మరి కిరణ్‌ను చేర్చుకోవటం పార్టీకి అవసరమేనా? అసలు కిరణ్ వల్ల పార్టీకి ఏమన్నా ఉపయోగముంటుందా? అన్నదే ఎవరికీ అర్థంకావటంలేదు. సమైక రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో కేవలం ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన కిరణ్ ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారంటే కేవలం అదృష్టం తప్ప మరోటికాదని అందరికీ తెలుసు.

అప్పట్లో పీలేరు నియోజకవర్గంలో కూడా కిరణ్ తిరుగులేని నేతేమీకాదు. కాకపోతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మద్దతుదారుడిగా ఉన్నారు కాబట్టి టికెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదంతే. నియోజకవర్గానికి ఎక్కువ, జిల్లాకు తక్కువన్నట్లుగా ఉండేది కిరణ్ పరిస్థితి. పక్కనే ఉన్న పుంగనూరు, మదనపల్లి, తంబళ్ళపల్లి నియోజకవర్గాల మీద కూడా కిరణ్ ప్రభావం కనబడేదికాదు. అలాంటి కిరణ్ అప్పటి రాజకీయమ‌పరిణామాల కారణంగా అధిష్టానాన్ని ఏదోలా మ్యానేజ్ చేసుకుని సీఎం అయిపోయారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీచేస్తే డిపాజిట్లు కూడా దక్కలేదు. తర్వాత చాలాకాలం జనాలకు దూరమైపోయారు. తర్వాతెప్పుడో కాంగ్రెస్‌లో చేరి అందులో ఇమడలేక మళ్ళీ కామ్‌గా ఉండిపోయారు. మళ్ళీ ఇంతకాలానికి బీజేపీలో చేరారు. కిరణ్ గురించి ఇంతకన్నా చెప్పాల్సింది కూడా ఏమీలేదు.

ఒక మాజీ ముఖ్యమంత్రి తమ పార్టీలో చేరారని చెప్పుకునేందుకు తప్ప కిరణ్ చేరిక బీజేపీకి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. తన నియోజకవర్గంలో తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు. పీలేరులో తమ్ముడి మీద గట్టి అభ్యర్థిని పోటీలోకి దింపి కిరణ్ బీజేపీని గెలిపించుకుంటే అదే పది వేలు. జిల్లా అంతా తిరిగి గట్టి అభ్యర్థుల‌ను పోటీలోకి దింపి గెలుపున‌కు కష్టపడితే కూడా గొప్పనే చెప్పాలి. ఇలాంటి కిరణ్ వల్ల బీజేపీకి ఏమి ఉపయోగముంటుందో ఎవరికీ అర్థ‌కావటంలేదు.

First Published:  8 April 2023 4:57 AM GMT
Next Story