రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 'సిట్'ను ఏర్పాటు
ప్రతి 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం
BY Raju Asari6 Dec 2024 5:55 PM IST

X
Raju Asari Updated On: 6 Dec 2024 5:55 PM IST
రేషన్ బియ్యం అక్రమ రవాణపై ప్రత్యేక దర్యాప్తు బృందం 'సిట్'ను ఏర్పాటు చేస్తూఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్‌కు చీఫ్‌గా వినీత్ బ్రిజ్ లాల్‌కు బాధ్యతలు అప్పగించారు. సిట్ సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్దన్, గోవిందరావు, డీఎస్పీలు బాలసుందర్‌రావు, రత్తయ్యలను నియమించారు. ప్రతి 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్‌కు పూర్తిస్థాయి అధికారాలు అప్పగించింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి .
Next Story