Telugu Global
Andhra Pradesh

అన్న‌మ‌య్య జిల్లాలో ఘోరం.. - బ‌స్సు, ఆయిల్ ట్యాంక‌ర్ ఢీ.. ఐదుగురు మృతి

కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ వేగంగా ఢీకొట్ట‌డంతో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న వారిలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

అన్న‌మ‌య్య జిల్లాలో ఘోరం.. - బ‌స్సు, ఆయిల్ ట్యాంక‌ర్ ఢీ.. ఐదుగురు మృతి
X

ఆర్టీసీ బ‌స్సు, ఆయిల్ ట్యాంక‌ర్ ఢీకొన్న ప్ర‌మాదంలో ఐదుగురి ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. అన్న‌మ‌య్య జిల్లా పుల్లంపేట మండ‌లంలో శ‌నివారం సాయంత్రం ఈ ఘోర దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 20 మంది గాయాల‌పాల‌య్యారు. గాయ‌ప‌డిన‌వారిని తిరుప‌తి, రాజంపేట ప్ర‌భుత్వాస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పుల్లంపేట సమీపంలోని మలుపు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ వేగంగా ఢీకొట్ట‌డంతో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న వారిలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం ట్యాంక‌ర్ డ్రైవ‌ర్ అతి వేగ‌మేన‌ని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు.

First Published:  23 July 2023 8:34 AM IST
Next Story