తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం.. - మంటలను అదుపులోకి తెచ్చిన అధికారులు
ఫిబ్రవరి 17న నూతన సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాల్సిన తరుణంలో ఉడ్ వర్క్ వేగవంతంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు 11 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
ఫిబ్రవరి 17న నూతన సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాల్సిన తరుణంలో ఉడ్ వర్క్ వేగవంతంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సచివాలయ గుమ్మటం ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం ఏ ఫ్లోర్‌లో జరిగింది.. దీనికి కారణాలేంటి అనే విషయంలో మాత్రం అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
అగ్ని ప్రమాదం నేపథ్యంలో అధికారులు ఎన్టీఆర్ మార్గ్‌ను మూసేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. మంత్రులు ఇక్కడి పరిస్థితిని పర్యవేక్షించే అవకాశం ఉంది.