Telugu Global
Andhra Pradesh

మహీ మనోడే.. మరి, వీరంతా ఎవరు..?

ఎల్వీ ప్రసాద్‌ మొదలుకొని అశ్వినీదత్‌ వరకు వారు పొందిన భూముల మాటేమిటి? అక్కినేని నాగేశ్వర రావు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడి స్టూడియో, కృష్ణ పద్మాలయ స్టూడియోల మాటేమిటి? హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనే కళాపోషణగా భావించి సినిమాలు తీస్తున్న రాఘవేంద్ర రావు మాటేమిటని అడిగితే ఏం సమాధానం చెప్తారు?

మహీ మనోడే.. మరి, వీరంతా ఎవరు..?
X

యాత్ర దర్శకుడు మహీ వి. రాఘవకు మినీ స్టూడియో నిర్మాణం కోసం కేవలం రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించినందుకు ఎల్లో మీడియాకు మండిపోతోంది. దాంతో ‘మహీ... మనోడే’ అంటూ తన అక్కసునంతా వెళ్లగక్కింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఆయన అత్యంత సన్నిహితుడని, అందుకే హార్సిలీ హిల్స్‌లో భూమిని కేటాయించారని వాపోయింది. ఆయన అసలు పేరు వారణాసి మహేందర్‌ రెడ్డి అని తానేదో కొత్తగా కనిపెట్టినట్లు ‘గొప్పలు’ పోయింది.

మహీ వి. రాఘవకు రెండెకరాల భూమి కేటాయించినందుకు ఏదో అపరాధం జరిగినట్లు వాపోతున్న ఎల్లో మీడియాకు సినీ ప్రముఖలు కొందరు ఇటు హైదరాబాద్‌లోనూ అటు ఆంధ్రలోనూ కళామతల్లికి సేవలందిస్తున్నారనే కారణంతో స్టూడియోలకు భూములు బొక్కేసిన వైనం కనిపించడం లేదా? ఈనాడు రామోజీరావుకు వేల ఎకరాలు కూడా సరిపోవడం లేదు కదా.. స్టూడియో పేరు మీద, మీడియా పేరు మీద ఆయన భూములను కొట్టేసిన వైనం గుర్తుకు రావడం లేదా? గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములు ఆక్రమించింది కాక చెరువులు, కాలువలు, రహదారులు, శ్మ‌శానాలు తదితరాలను తన ఫిలిం సిటీలో కలిపేసుకున్న రామోజీరావు ఇన్ని లక్షల కోట్ల విలువైన‌ భూములు చాలవన్నట్లు ఇప్పుడు కూడా మరో కొన్ని వందల ఎకరాల కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెడుతున్న విషయం ప్రజలకు తెలియదా?

ఎల్వీ ప్రసాద్‌ మొదలుకొని అశ్వినీదత్‌ వరకు వారు పొందిన భూముల మాటేమిటి? అక్కినేని నాగేశ్వర రావు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడి స్టూడియో, కృష్ణ పద్మాలయ స్టూడియోల మాటేమిటి? హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనే కళాపోషణగా భావించి సినిమాలు తీస్తున్న రాఘవేంద్ర రావు మాటేమిటని అడిగితే ఏం సమాధానం చెప్తారు? నిర్మాత దగ్గుబాటి సురేష్‌ నిర్మించిన స్టూడియోకు భూమి తీసుకోలేదా? వైఎస్‌ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చీరాక ముందే రామానాయుడు ఫ్యామిలీ విశాఖలో స్టూడియో నిర్మాణానికి విలువైన స్థలం తీసుకోలేదా? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు ఇంకా ఎంత మంది లేరు?

తమకు ఇష్టులైనవాళ్లంతా అత్యంత ఖరీదైన నగరాలలోని భూములను తీసుకుంటే మాత్రం ఎల్లో మీడియా అదేదో పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ దోహదం లాగా ప్రచారం చేసింది. అదే ఇప్పుడు ఎక్కడో వెనకబడిన చిత్తూరు జిల్లాలో అతి తక్కువ ఖరీదు చేసే రెండు ఎకరాల భూమిని కేటాయించినందుకు వీళ్లకింతగా కడుపు మండిపోతుందా? వీళ్లకు, వీళ్లవాళ్లకు తప్ప ఇతరులెవరికీ చిన్న మేలు జరిగినా తట్టుకోలేరా?

స్టూడియోల నిర్మాణానికి భూములు తీసుకుని వాణిజ్య అవసరాల కోసం వాడుకున్నవారు లేరా? ఎవరి అండదండలతో ఆ పని చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు ఎల్లో మీడియాకు గుర్తుకు రావు? వారంతా ఎవరి ప్రయోజనాల కోసం సినిమాలు తీశారు? వారంతా ఎవరి కోసం పనిచేశారు? వారు ఎవరి కోసం పనిచేశారో, చేస్తున్నారో అందరికీ తెలిసిందే. మరి, అలాంటప్పుడు మహీ వి. రాఘవపై ఏడుపు ఎందుకు?

First Published:  12 Feb 2024 4:46 PM IST
Next Story