Telugu Global
Andhra Pradesh

వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి మృతి

వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్‌ రంగన్న మృతి చెందారు

వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి మృతి
X

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్‌ రంగన్న మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.85 ఏళ్ల రంగన్న వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో పోలీసులు రంగన్నను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.2019 మార్చి 15న పులివెందులలో వివేకా హత్య జరిగిన సమయంలో ఆ ఇంటికి రంగన్న వాచ్‌మెన్‌గా పనిచేశారు. సీబీఐకి వాంగ్మూలం ఇస్తూ పలు కీలక అంశాలు బయటపెట్టారు. హత్య కేసులో కీలక సాక్షిగా నమోదు చేసిన సీబీఐ ఛార్జిషీట్‌లో సైతం పలు అంశాలు పేర్కొంది. కేసు విచారణ సమయంలో కీలకంగా ఉపయోగపడే రంగన్న మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశమైంది.

First Published:  5 March 2025 8:23 PM IST
Next Story