ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. సజ్జల ఏమన్నారంటే?
ఐదేళ్లలో అమలు చేసిన పథకాల ద్వారా లబ్ధిపొందిన మహిళలు, ఇతర వర్గాలు మరోసారి వైసీపీకి అండగా నిలిచాయన్నారు సజ్జల.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. అంచనాలను మించి జూన్ 4న వైసీపీకి మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో భారీగా సైలెంట్ ఓటింగ్ జరిగిందన్నారు సజ్జల.
ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ అన్నీ వైయస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ అంచనాల కంటే జూన్ 4న మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి.
— YSR Congress Party (@YSRCParty) June 1, 2024
-వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/ZbbBQwHvZ7
ఐదేళ్లలో అమలు చేసిన పథకాల ద్వారా లబ్ధిపొందిన మహిళలు, ఇతర వర్గాలు మరోసారి వైసీపీకి అండగా నిలిచాయన్నారు సజ్జల. సీఎంగా జగన్ ఉంటేనే మంచి జరుగుతుందని ఆయా వర్గాలు భావించాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇవే విషయాలను స్పష్టం చేశాయన్నారు.
ఇక చంద్రబాబు కూటమి అసాధ్యమైన హామీలు ఇచ్చిందని.. కేవలం విద్వేషంతో ప్రచారం చేసిందన్నారు. తాము ఎక్కడా విద్వేష ప్రసంగాలు గానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు గానీ చేయలేదన్నారు. ఒంటరిగా పోటీ చేయలేని తెలుగుదేశం కూడా.. జగన్‌ను ఓడిస్తామని బీరాలు పలికిందన్నారు. తాము చేసింది చెప్పుకోవడానికే ప్రయత్నించామన్నారు సజ్జల.