Telugu Global
Andhra Pradesh

మీరయితే ఎకరాలెకరాలు తీసుకోవచ్చా..? మావి కూల్చేస్తారా..?

2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో 12 ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాలు లీజుకు తీసుకుని పార్టీ ఆఫీస్ లు కట్టుకున్నారని, ఆ రికార్డులన్నీ తమమ వద్ద ఉన్నాయన్నారు మార్గాని భరత్.

మీరయితే ఎకరాలెకరాలు తీసుకోవచ్చా..? మావి కూల్చేస్తారా..?
X

కూటమి ప్రభుత్వం రావడం రావడమే విధ్వంసంతో పరిపాలన ప్రారంభించిందని మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ప్రభుత్వ జీవో ప్రకారం స్థలం లీజుకి తీసుకుని తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నామని, దాన్ని కూల్చివేయడం దారుణం అని అన్నారు. అన్ని అనుమతులున్నా కూడా, కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి కూటమి ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. దీనికి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మార్గాని భరత్.


ప్రజావేదికతో పోలికేంటి..?

ప్రజా వేదిక కూల్చేసినప్పుడు టీడీపీ రాద్ధాంతం చేసిందని, కానీ అది చట్టవిరుద్ధంగా కట్టిన నిర్మాణం అని చెప్పారు మార్గాని భరత్. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించేలా ఆ నిర్మాణం సాగిందన్నారు. అందుకే అది కూల్చి వేశామన్నారు. అది కక్షసాధింపు ఎంతమాత్రం కాదన్నారు మార్గాని భరత్. ఇప్పుడు టీడీపీ చేస్తుంది మాత్రం ముమ్మాటికీ కక్షసాధింపేనన్నారాయన.

టీడీపీకి ఒక న్యాయం, వైసీపీకి ఒక న్యాయమా అని సూటిగా ప్రశ్నించారు మార్గాని భరత్. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో 12 ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాలు లీజుకు తీసుకుని పార్టీ ఆఫీస్ లు కట్టుకున్నారని, ఆ రికార్డులన్నీ తమమ వద్ద ఉన్నాయన్నారు. వైసీపీ అధికారికంగా లీజుకి తీసుకుని పార్టీ ఆఫీస్ కట్టుకుంటే తప్పా అని ప్రశ్నించారు భరత్.

First Published:  22 Jun 2024 5:10 PM IST
Next Story