ఆదివారం, అడ్డగాడిద.. పేర్ని నాని శృతి మించారా..?
వాక్ స్వాతంత్రం నిజంగానే లేకపోతే అసలు మీరంతా ఈరోజు మీటింగ్ పెట్టుకునేవారా అని ప్రశ్నించారు. పనిలో పనిగా ప్రతి ఆదివారం ఓ అడ్డగాడిద వచ్చి జగన్ ని విమర్శించేదా అంటూ ఘాటుగా మాట్లాడారు పేర్ని నాని.
"జగన్ ను తిట్టడానికి ప్రతి ఆదివారం ఒక అడ్డ గాడిద వస్తోంది.. అంటే అడ్డ గాడిదలకు కూడా వాక్ స్వాతంత్రం ఉన్నట్లేగా..?" అంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇప్పటికిప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడా జగన్ ని విమర్శించలేదు. కనీసం జనసేన నేతలు కూడా పెద్దగా నోరు చేసుకోలేదు. కానీ ఈరోజు పవన్ కల్యాణ్ ని పేర్ని నాని టార్గెట్ చేయడంతో సోషల్ మీడియాలో గొడవ మొదలైంది.
నానీకి కోపమెందుకొచ్చింది..?
తాజాగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఏపీలో వాక్ స్వాతంత్రం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలతో పేర్ని నానికి కోపమొచ్చింది. వాక్ స్వాతంత్రం నిజంగానే లేకపోతే అసలు మీరంతా ఈరోజు మీటింగ్ పెట్టుకునేవారా అని ప్రశ్నించారు. పనిలో పనిగా ప్రతి ఆదివారం ఓ అడ్డగాడిద వచ్చి జగన్ ని విమర్శించేదా అంటూ ఘాటుగా మాట్లాడారు. అఖిలపక్ష సమావేశంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పేర్నినాని. సీఎం వైఎస్ జగన్ పై నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మీ అందరికీ ఎందుకంత భయం అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ డ్యాన్స్ వేయమంటే సీపీఐ రామకృష్ణ ఆ డ్యాన్స్ వేస్తారని, నారాయణ, రామకృష్ణ వంటి కుహనా మేధావులంతా చంద్రబాబు పక్కన చేరారని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీతో కుమ్మక్కై ఎన్ని కుట్రలు చేసినా అన్నీ ఛేదించుకుని జగన్ బయటకొచ్చారని చెప్పారు.
సీఎం జగన్ ని చూసి భయపడి చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు పేర్ని నాని. విపక్షాల ధర్నాలకు వైసీపీలో చిన్న కార్యకర్త కూడా భయపడే పరిస్థితి లేదన్నారు. జీతాలు సకాలంలో రాకపోతే ఉద్యోగ సంఘాలు ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. కోర్టు మొట్టి కాయలు వేసినా జనసేనకు బుద్ధి రావటం లేదని విమర్శించారు.
బావతో తిరిగాడుగా బామ్మర్దితో తిరిగితే తప్పేంటి..?
పవన్ కల్యాణ్, బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో పై కూడా పేర్ని నాని సెటైర్లు వేశారు. బావ చంద్రబుతో తిరిగిన పవన్ కల్యాణ్, బావమరిది బాలకృష్ణతో తిరిగితే తప్పేంటని అన్నారు. అన్ స్టాపబుల్ షో.. పేమెంట్ ప్రోగ్రాం అని, ప్రశ్నలు అడిగేవారికి, సమాధానాలు చెప్పేవారికి.. ఇద్దరికీ డబ్బులిస్తారని చెప్పారు. ఎవరి డైలాగులు వాళ్లకు ముందే ఇస్తారని.. ఈ టాక్ షో తో బావ కోసం పని చేయటానికి బాలయ్యకు మరో అవకాశం వచ్చిందన్నారు. ఎన్టీఆర్ కొడుకై ఉండి కూడా తండ్రి వెన్నుపోటు వ్యవహారంలో బాలకృష్ణ, చంద్రబాబుకి మద్దతిచ్చారని మండిపడ్డారు.