విచారణ అంటే అంత భయమెందుకు నారాయణా..?
గురుశిష్యులిద్దరూ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పక్కాగా బుక్కయ్యారు. ఇద్దర్నీ రేపు(బుధవారం) సీఐడీ విచారణకు రావాలని చెప్పింది. ఈ విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారనే భయంతో నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల్లో భయం పెరిగిన మాట వాస్తవం. తాజాగా బండారు సత్యనారాయణ అరెస్ట్ తర్వాత ఈ ఆందోళన వారిలో రెట్టింపైంది. విచారణకు భయపడేది లేదంటూ కోతలు కోసే నారా లోకేష్ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తన పేరు చేర్చగానే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు ఆ బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేయడంతో రేపు సీఐడీ విచారణకు రాబోతున్నారు లోకేష్. ఇక లోకేష్ తో పాటు రేపు విచారణకు రావాల్సిన మాజీ మంత్రి నారాయణ కూడా హడలిపోతున్నారు. అరెస్ట్ భయంతో ఈరోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ ఈనెల 16కు వాయిదా పడింది. అరెస్ట్ చేయొద్దన్న గత ఉత్తర్వులను న్యాయస్థానం రెండు వారాలు పొడిగించడం విశేషం. దీంతో నారాయణ అరెస్ట్ ని తప్పించుకున్నారు, కానీ విచారణరు హాజరు కాక తప్పడంలేదు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తప్పు చేయలేదని టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారు. కనీసం ఆ సెంటర్లు ఎక్కడున్నాయి, వాటిలో 371 కోట్ల రూపాయలతో చేసిన ఖర్చేంటి అనేది కూడా కనపడ్డంలేదు. దీంతో అందరూ చంద్రబాబు వయసైపోయింది, ఆయనకు అనుభవం ఉంది అంటూ సింపతీకోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసు మరీ దారుణం. అసలు రోడ్డే వేయకుండా అలైన్ మెంట్లు ఇష్టం వచ్చినట్టు మార్చేసి, రియల్ ఎస్టేట్ స్కామ్ చేశారు టీడీపీ నేతలు. ఈ కేసులో చంద్రబాబు ఏ-1 కాగా, మాజీ మంత్రి నారాయణ ఏ-2. ఇటీవలే నారా లోకేష్ ని ఏ-14గా చేర్చారు. ఈ కేసులో విచారణ జరిగితే కచ్చితంగా అందరూ జైలుకెళ్లక తప్పదు అనే భయం వారిలో ఉంది. అందుకే ముందస్తు బెయిల్ కోసం అందరూ తిప్పలు పడుతున్నారు.
గురుశిష్యులిద్దరూ..
నారాయణ విద్యాసంస్థల్లో లోకేష్ కొన్నాళ్లు చదువుకున్నారని, ఆయనకు లోకేష్ శిష్యుడు అని అంటారు. ఈ గురుశిష్యులిద్దరూ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పక్కాగా బుక్కయ్యారు. ఇద్దర్నీ రేపు(బుధవారం) సీఐడీ విచారణకు రావాలని చెప్పింది. ఈ విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారనే భయంతో నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కూడా ఆయన పిటిషన్లో కోరారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. నారాయణను అరెస్టు చేయవద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు మరో రెండు వారాలు పొడిగించింది.