ఓడిపోతే రాజకీయ సన్యాసం.. వైసీపీ ఎంపీ అభ్యర్థి సవాల్
పౌరుషాల పల్నాడు గడ్డ నుంచి తాను సవాల్ విసురుతున్నానని, నర్సరావు పేటలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, తన సవాల్ ను స్వీకరించే దమ్ముందా అని అన్నారు అనిల్.
ఇటీవల నెల్లూరు పర్యటనలో చంద్రబాబు.. మాజీ మంత్రి అనిల్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బుల్లెట్ దిగుద్ది అంటూ అసెంబ్లీలో సవాళ్లు విసిరిన అనిల్.. జగన్ తరిమేస్తే రెండు జిల్లాల అవతల వెళ్లి పడ్డారని కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ ని నర్సరావు పేటకి తరిమేశారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలకి అంతే ఘాటుగా బదులిచ్చారు అనిల్. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున బరిలో దిగుతున్న ఆయన.. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ లోకేష్ స్వీకరించాలని, చంద్రబాబుకి పౌరుషం ఉంటే లోకేష్ తో తన సవాల్ స్వీకరింపజేయాలని అన్నారు అనిల్.
నరసరావుపేటలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం ... నా సవాల్ ను స్వీకరించే దమ్ముందా @ncbn, @naralokesh?
— YSR Congress Party (@YSRCParty) March 4, 2024
-నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్#TDPJSPCollapse#MosagaduBabu#PoliticalBrokerPK#EndOfTDP pic.twitter.com/iNOdw4Nr2G
పౌరుషాల పల్నాడు గడ్డ మీదనుంచి తాను సవాల్ విసురుతున్నానని, నర్సరావు పేటలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, తన సవాల్ ను స్వీకరించే దమ్ముందా అని అన్నారు అనిల్. అన్నీ త్యాగం చేసి రాజకీయాలే పరమావధిగా బతుకుతున్నానని చెప్పారు. తన 20 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి సవాల్ విసురుతున్నానని అన్నారు.
ఎవరొస్తారో రండి..
పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్న అనిల్.. చంద్రబాబు కానీ, ఆయన కొడుకు కానీ తన సవాల్ స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా ఉన్నానని, నారా లోకేష్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదని ఎద్దేవా చేశారు. పల్నాడు గడ్డ మీద నుంచి తాను చాలెంజ్ విసురుతున్నానని, చిత్తూరు పౌరుషం కానీ, రాయలసీమ పౌరుషం కానీ ఉంటే చంద్రబాబు, లోకేష్ బదులివ్వాలని అన్నారు అనిల్.