Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు హైటెక్‌ సిటీ బాగోతం.. అమరావతి విషయంలోనూ అదే..

హైటెక్‌ సిటీ ఏర్పాటుకు ముందు, హైటెక్‌ సిటీ ఫలానా ప్రాంతంలో నిర్మిస్తున్నామని అధికారిక ప్రకటన చేయడానికి ముందు చంద్రబాబు ఒడిగట్టిన కార్యానికి సంబంధించి మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ సంచలన విషయాన్ని బయటపెట్టారు.

చంద్రబాబు హైటెక్‌ సిటీ బాగోతం.. అమరావతి విషయంలోనూ అదే..
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టే ప్రాజెక్టుల తీరు ఎలా ఉంటుంది, వాటిని ఆయన ఎలా సొమ్ము చేసుకుంటారనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఓ సంచలన విషయం వెలుగులోకి వ‌చ్చింది. దీన్ని బట్టి అమరావతి విషయంలో ఆయన ఏం చేశారనేది అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీని తానే నిర్మించానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే, దాన్ని ఆయన తన స్వలాభం కోసం వాడుకున్న తీరు తాజాగా బయటపడింది.

హైటెక్‌ సిటీ ఏర్పాటుకు ముందు, హైటెక్‌ సిటీ ఫలానా ప్రాంతంలో నిర్మిస్తున్నామని అధికారిక ప్రకటన చేయడానికి ముందు చంద్రబాబు ఒడిగట్టిన కార్యానికి సంబంధించి మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ సంచలన విషయాన్ని బయటపెట్టారు. హైటెక్‌ సిటీ ప్రకటన చేయకముందే ఆ ప్రాంతంలో చంద్రబాబు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. హైటెక్‌ సిటీ వల్ల ఆయన కొనుగోలు చేసిన భూమి ధర పెరుగుతుందనేది వేరుగా చెప్పాల్సిన పని లేదు. తన అధికారాన్ని చంద్రబాబు అలా వాడుకున్నారని ఈ సంఘటన తెలియజేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించడానికి ముందే చంద్రబాబు బినామీలు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు ఆ చుట్టుపక్కల భూములు కొనేశారనే ఆరోపణల్లో నిజం ఉంటుందని స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు.

అమరావతిలో కేవలం లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ మాత్రమే ఉంచి, విశాఖపట్నం నగరానికి పరిపాలనా రాజధానిని, కర్నూలుకు న్యాయ రాజధానిని తరలించడానికి జగన్‌ పూనుకుంటే దానికి అడ్డుపడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేస్తానని చంద్ర‌బాబు హామీ ఇస్తున్నారు. దానికి ఆయన మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ వంత పాడుతున్నారు. అంటే, తన స్వలాభం కోసం చంద్రబాబు ఎంతగా తెగిస్తారని, తనకు అధికారం కూడా అందుకేనని ఎవరికైనా అర్థ‌మైపోతుంది,

First Published:  6 Feb 2024 3:21 PM IST
Next Story