ఎక్కే గుమ్మం దిగే గుమ్మమేనా?
స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అవ్వగానే ముందు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటీషన్ వేశారు. తర్వాత హైకోర్టుకెక్కారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. అంటే కింద కోర్టు నుండి దేశ సర్వోన్నత న్యాయస్థానం వరకు వెళ్ళినా ఫలితం దక్కలేదు.
కాలం ఎల్లకాలం ఒకలాగుండదు అనటానికి చంద్రబాబు పరిస్థితే తాజా ఉదాహరణ. ఎంతటి చంద్రబాబు ఎంతలాగ అయిపోయారో ఆశ్చర్యమేస్తోంది చూస్తుంటే. గడచిన 19 రోజులుగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్లుగా అయిపోయింది. స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అవ్వగానే ముందు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటీషన్ వేశారు. తర్వాత హైకోర్టుకెక్కారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. అంటే కింద కోర్టు నుండి దేశ సర్వోన్నత న్యాయస్థానం వరకు వెళ్ళినా ఫలితం దక్కలేదు.
ఇదే చంద్రబాబు ఒకప్పుడు అంటే దాదాపు మూడు సంవత్సరాలపాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేశారో అందరు చూసిందే. 151 సీట్లతో అధికారంలోకి వచ్చామన్నా సంతోషం కూడా జగన్‌కు లేకుండా చేశారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టుల ద్వారా అడ్డుకున్నారు. పోనీ జగన్ ప్రభుత్వం ఏమన్నా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నదా అంటే అదీలేదు. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం దగ్గర నుండి మూడు రాజధానుల వరకు ప్రతి నిర్ణయాన్ని కోర్టుల్లో పిటీషన్లు వేయించి అడ్డుకున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్నివందల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాజ్యం అలా దాఖలవ్వటం ఆలస్యం వెంటనే ప్రభుత్వ నిర్ణయం అమలయ్యేందుకు లేకుండా కోర్టు స్టే ఇచ్చేసేది. ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబే ప్రభుత్వాన్ని శాసిస్తున్నారా అనే సందేహాలు పెరిగిపోయేంతగా జగన్ పరిపాలనను అడ్డుకున్నారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నారంటే కాల మహిమ కాక మరేమిటి? మూడు కోర్టుల్లోనూ కలిపి సుమారు 10 పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
బెయిల్ దొరకలేదు, మధ్యంతర బెయిల్ దొరకలేదు చివరకు ముందస్తు బెయిల్ మీద విచారణలు కూడా వాయిదాల మీద వాయిదా పడుతోంది. ఇదే సమయంలో కొడుకు లోకేష్ అరెస్టు భయం కూడా పెరిగిపోతోంది. లోకేష్ అరెస్టయితే తన పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ లాగే అయిపోతుందేమో. విచిత్రం ఏమిటంటే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. చంద్రబాబు విషయంలో మీకు ఏం కావాలని లాయర్ సిద్దార్థ లూథ్రాను అడిగారట. అరెస్టు అక్రమమని లూథ్రా చెప్పారట.
బెయిల్ కావాలంటే దరఖాస్తు చేసుకోమని చీఫ్ జస్టిస్ చెప్పినప్పుడు కూడా లూథ్రా చంద్రబాబును గవర్నర్ అనుమతి లేకుండానే అరెస్టు చేశారని అన్నారు.. కానీ బెయిల్ దరఖాస్తు ప్రస్తావన మాత్రం తేలేదట. అక్టోబర్ 3వ తేదీ వరకు చంద్రబాబు జైలులోనే ఉండక తప్పేట్లులేదు. ఈలోగా లోకేష్ విషయం కూడా తేలిపోతుందేమో. అందుకనే అంటారు పెద్దలు.. అతి చేస్తే గతి చెడుతుందని.
♦