Telugu Global
Andhra Pradesh

ఏపీలో పలువురు ఐపీఎస్‌, ఐఏఎస్‌ల బదిలీ

వీరందరినీ వెంటనే ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి పంపాల‌ని స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో పలువురు ఐపీఎస్‌, ఐఏఎస్‌ల బదిలీ
X

ఏపీలో ఎన్నికల వేళ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. ఇందులో ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు ఐపీఎస్‌లు ఉన్నారు. వీరందరినీ వెంటనే ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి పంపాల‌ని స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

బదిలీ వేటు పడిన అధికారులు వీళ్లే -

- చిత్తూరు ఎస్పీ - జాషువా

- పల్నాడు ఎస్పీ - రవి శంకర్ రెడ్డి

- ప్రకాశం ఎస్పీ - పరమేశ్వర్

- నెల్లూరు ఎస్పీ - తిరుమలేశ్వర్

- అనంతపురం ఎస్పీ - అన్బురాజన్‌

- గుంటూరు రేంజ్ ఐజీ - పాల్‌రాజు

- కృష్ణా జిల్లా కలెక్టర్‌ - రాజబాబు

- అనంతపురం కలెక్టర్ - గౌతమి

- తిరుపతి కలెక్టర్ - లక్ష్మీషా

First Published:  2 April 2024 4:55 PM IST
Next Story