ఏపీలో పోలింగ్ శాతం ఎంతంటే..?
కౌంటింగ్‌కు మరో 20 రోజుల గడువు ఉండడంతో పార్టీలు ఎవరికీ వారే గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ప్రభుత్వ సానుకూల ఓటు భారీగా నమోదైందని.. గెలుపు తమదేనని వైసీపీ ఆత్మవిశ్వాసంతో ఉంది.
ఏపీలో ఫైనల్ పోలింగ్ పర్సంటేజిని అధికారికంగా ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. ఫైనల్ పోలింగ్ పర్సంటేజీ 80.66 శాతంగా తేల్చింది. దీనికి పోస్టల్ బ్యాలెట్ 1.2 శాతం కలిపితే మొత్తంగా ఏపీలో పోలింగ్ శాతం 81.86 శాతంగా నమోదైందని పేర్కొంది.
2019లో 79.80 శాతంగా పోలింగ్ నమోదు కాగా.. ఈసారి దాదాపు 2 శాతం పెరిగింది. ఇక 2014లో ఏపీలో పోలింగ్ శాతం 78.90 శాతంగా నమోదైంది. పెరిగిన ఓటు శాతం ఎవరికీ కలిసివస్తుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
కౌంటింగ్‌కు మరో 20 రోజుల గడువు ఉండడంతో పార్టీలు ఎవరికీ వారే గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ప్రభుత్వ సానుకూల ఓటు భారీగా నమోదైందని.. గెలుపు తమదేనని వైసీపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక కూటమి సైతం పెరిగిన ఓటు శాతం తమను విజయతీరాలకు చేర్చుతుందని ఆశాభావంతో ఉంది. ఈనెల 13న ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.