ఇంగ్లీష్ మీడియంపై విషం చిమ్మిన రామోజీ ఈనాడు
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద పిల్లలకు, దళితుల పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో, ఉత్తమ విద్యను అందించడానికి కార్పోరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు.
పాఠశాలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంపై రామోజీరావుకు చెందిన ఈనాడు పత్రిక మరోసారి విషం చిమ్మింది. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం, వారు ఉన్నతస్థాయికి చేరుకోవడం ఇష్టం లేని రామోజీరావు, వెంకయ్యనాయుడు, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం వల్ల మాతృభాష చచ్చిపోతుందని సుద్దులు చెబుతున్నారు.
ఆమెరికాలో తెలుగు, అంటే మాతృభాష మాట్లాడేవారి సంఖ్య పెరుగుతోందని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సదస్సులో ఆమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు చెప్పారు. దీన్నిబట్టి ఇంగ్లీష్ మీడియంలో విద్యను అభ్యసించినంత మాత్రాన మాతృభాషకు కలిగే నష్టం ఏమీ లేదని అర్థం చేసుకోవచ్చు. తెలుగు భాష పరిరక్షణ గురించి మాట్లాడే ఒక సామాజిక వర్గానికి చెందిన పెద్దలు తమ పిల్లలు, ఆ పిల్లల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదా అనేది ప్రశ్న.
సిలబస్‌తో సర్కస్ అంటూ ఈనాడు అబద్ధాలను రంగరించి ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వేయి పాఠశాలలను సీబీఎస్‌ఈ బోర్డుకు అనుసంధానం చేశారు. 44,478 పాఠశాలల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను మాత్రమే బోధిస్తున్నారు. పరీక్షలు నిర్వహించే బోర్డులు వేరే అయినప్పటికీ సిలబస్ మాత్రం ఒక్కటే. వచ్చే ఏడాది మొదటగా పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తారు.
విద్యార్థులు ఇంగ్లీష్ చదవలేని పరిస్థితి ఎక్కడ ఉందో ఈనాడు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. టోఫెల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్‌ను పెంచడానికి స్మార్ట్ టీవీల ద్వారా, ఐఎఫ్‌పీల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. బోధనను ఇంగ్లీష్ బోధించే టీటర్లకు అప్పగించారు. తెలుగు ఉపాధ్యాయులకు ఆ బాధ్యతను అప్పగించలేదు.
గత చంద్రబాబు ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి కార్పోరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు మద్దతు ఇచ్చింది. కార్పోరేట్ విద్యాసంస్థలు ఫీజులు, డొనేషన్ల రూపంలో పిల్లల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసి తమ విద్యావ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి దోహదం చేసింది. పేద పిల్లలకు, దళితుల పిల్లలకు విద్యను దూరం చేసింది.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద పిల్లలకు, దళితుల పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో, ఉత్తమ విద్యను అందించడానికి కార్పోరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. కార్పోరేట్ స్కూళ్లలో చదివే పిల్లలతో పేదల పిల్లలు పోటీ పడడానికి ప్రభుత్వ బడులను తీర్చి దిద్ది విద్యను అందించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. దీన్ని సహించలేని రామోజీరావు చేతుల్లో మీడియా ఉంది కదా అని విషం చిమ్ముతున్నారు.