భీమిలి 'సిద్ధం' సభపై విషం చిమ్మిన ఈనాడు
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నేరుగా ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తద్వారా పార్టీ శ్రేణులు వాటిని గుర్తు పెట్టుకుని మరింతగా ప్రచారం పెడుతారనేది ఆయన అభిమతం .
ఉత్తరాంధ్రకు సంబంధించిన వైఎస్ జగన్ `సిద్ధం` సభ ఇటీవల భీమిలిలో జరిగింది. ఈ సభపై రామోజీరావు ఈనాడు దినపత్రిక విషం చిమ్మింది. సభకు పెద్దగా ఆదరణ లభించలేదని కట్టుకథ అల్లింది. నిజానికి, భీమిలిలో జరిగిన వైఎస్ జగన్ సభకు పార్టీ శ్రేణులు పోటెత్తారు. సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది, దీన్ని చూసి ఓర్వలేక రామోజీరావు తన పత్రికలో సభకు పెద్దగా ఆదరణ లభించలేదనే అబద్ధం ప్రచారం చేయడానికి పూనుకున్నారు.
పార్టీ శ్రేణులతో మమేకం కావడానికి జగన్ సిద్ధం సభను ఎంచుకున్నారు. తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నేరుగా ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తద్వారా పార్టీ శ్రేణులు వాటిని గుర్తు పెట్టుకుని మరింతగా ప్రచారం పెడుతారనేది ఆయన అభిమతం . రెండో సిద్ధం సభ ఏలూరులో జరుగుతుంది. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తే కలిసి వస్తుందనే ఉద్దేశంతో మొదటి సిద్ధం సభను ఆయన భీమిలిలో నిర్వహించారు.
ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో వైఎస్పార్ కాంగ్రెస్ 28 స్థానాలను గెలుచుకుంది. గోదావరి, కోస్తా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) బలంగా ఉందనే అభిప్రాయం ఒకటి చలామణిలో ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కూడా మంచి పట్టు ఉందని అంటారు. దాంతో ఆ జిల్లాలపై జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు. అందులో భాగంగానే రెండో `సిద్ధం` సభను ఏలూరులో నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలున్నాయి. వీటిలో అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఆయన పార్టీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడేందుకు ఏలూరు `సిద్ధం` సభను నిర్వహించనున్నారు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి ఏలూరు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు 100 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ సభకు తరలి వచ్చే అవకాశం ఉంది. దాంతో వారు ఇబ్బంది పడకుండా విశాలమైన ప్రాంగణాన్ని ఎంపిక చేశారు.