Telugu Global
Andhra Pradesh

రాఘవకు బెయిల్ ఇవ్వొద్దు.. సుప్రీం మెట్లెక్కిన ఈడీ

రాఘవ బెయిల్ పై ఈడీ అభ్యంతరం తెలిపింది. బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది.

రాఘవకు బెయిల్ ఇవ్వొద్దు.. సుప్రీం మెట్లెక్కిన ఈడీ
X

ఢిల్లీ మద్యం కేసులో నిందితుడుగా ఉన్న మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు 15రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. దగ్గరి బంధువుల ఆరోగ్యం బాగోలేదని కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి రాఘవ బెయిల్ పొందారని ఈడీ ఆరోపించింది. వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరింది. ఈ పిటిషన్ పై రేపు విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్ట్ వెకేషన్ బెంచ్ అంగీకరించింది. జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ రమేశ్‌ బిందాల్‌ తో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ఈ కేసుపై విచారణ జరుపుతుంది.

ఢిల్లీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవ ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అప్పటినుంచి బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు. ట్రయల్ కోర్ట్ ఆయన బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది. అయితే తిరిగి ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి రాఘవకు 15రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

ఈడీ అభ్యంతరం..

రాఘవ బెయిల్ పై ఈడీ అభ్యంతరం తెలిపింది. బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. ట్రయల్‌ కోర్టు బెయిల్ పిటిషన్‌ ను తిరస్కరిస్తే ఢిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అదనపు సొలిసిటర్‌ జనరల్‌. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ పై వెంటనే విచారణ చేపట్టి స్టే ఇవ్వాలని కోరారు. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ చేపడతామని సుప్రీంకోర్ట్ వెకేషన్ బెంచ్ తెలిపింది.

First Published:  8 Jun 2023 4:03 PM IST
Next Story