జగన్‌పై నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు.. పవన్‌కు ఈసీ నోటీసులు
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్కామ్ స్టార్, ల్యాండ్ గ్రాబర్, స్కామ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు.
సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా కామెంట్లు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులిచ్చింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ.. 48 గంటల్లోగా దీనిపై సంజాయిషీ ఇవ్వాలంటూ పవన్‌కు బుధవారం నోటీసులిచ్చింది.
స్కామ్ స్టార్, ల్యాండ్ గ్రాబర్ అని ప్రేలాపనలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్కామ్ స్టార్, ల్యాండ్ గ్రాబర్, స్కామ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రిని ఇలాంటి మాటలు అనడం దారుణమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఎలక్షన్ కోడ్‌కు విరుద్ధంగా వ్యాఖ్యలు
మల్లాది విష్ణు ఈ నెల 8న దీనిపై ఈసీకి కంప్లయింట్ చేశారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా జగన్ వ్యాఖ్యలున్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కంప్లయింట్‌ను పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు దీనిపై 48 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.