Telugu Global
Andhra Pradesh

ఫైల్స్ దగ్ధం.. నేతల మధ్య మాటల యుద్ధం

ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు, ఎందుకిలా చేశారు అనే వివరాలను ఆయన ఆరా తీశారు.

ఫైల్స్ దగ్ధం.. నేతల మధ్య మాటల యుద్ధం
X

ఏపీలో కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఫైల్స్, హార్డ్ డిస్క్ లు దగ్ధమైన ఘటన రాజకీయ కలకలం సృష్టించింది. ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీ తప్పు మీదంటే మీదంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. తప్పు చేశారు కాబట్టే ఫైల్స్ దగ్ధం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుండగా, మీ ప్రభుత్వ హయాంలో తగలబడితే మాపై నిందలు వేస్తే ఎలా అని వైసీపీ నేతలు లాజిక్ తీస్తున్నారు.

ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు, ఎందుకిలా చేశారు అనే వివరాలను ఆయన ఆరా తీశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కు చెందిన ఇతర కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయనే విషయంపై తనకు నివేది ఇవ్వాలని ఆదేశించారు.


వైసీపీ రివర్స్ అటాక్..

ఫైళ్ల దగ్ధం ఘటనపై వైసీపీ కూడా ఘాటుగా బదులిచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వారికి నచ్చినట్టు అధికారుల్ని మార్చేసుకుంటున్నారు. వారు మెచ్చినవారికే కీలక పోస్టింగ్ లు ఇచ్చారు. కొత్త ప్రభుత్వ హయాంలో ఫైళ్లు తగలబడిన ఘటన జరిగితే, పాత ప్రభుత్వాన్ని నిందించడమేంటని నిలదీశారు మాజీ మంత్రి పేర్ని నాని. అధికారం మీచేతుల్లోనే ఉంది కదా, మీరే విచారణ చేయించుకోవచ్చు కదా అని అన్నారు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు నాని.



First Published:  5 July 2024 7:52 AM IST
Next Story