తిరుమలలో జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అడిషనల్ ఈవో వెల్లడి
BY Raju Asari26 Nov 2024 9:28 AM IST
X
Raju Asari Updated On: 26 Nov 2024 9:29 AM IST
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, జనవరి 10-19వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ సమయంలో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు మినహా చింటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశమైన ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు.
Next Story