Telugu Global
Andhra Pradesh

స్టేజ్‌పైనే మద్యం తాగి, హీరోయిన్‌ను తోసేసి.. బాలకృష్ణ అసభ్య ప్రవర్తన

బాలకృష్ణ వ్యవహారశైలి వివాదాస్పదం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ బాలకృష్ణ హీరోయిన్లతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

స్టేజ్‌పైనే మద్యం తాగి, హీరోయిన్‌ను తోసేసి.. బాలకృష్ణ అసభ్య ప్రవర్తన
X

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదంగా మారింది. విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ మంగళవారం జరిగింది. అయితే ఈ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన బాలకృష్ణ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది.


ఈ సినిమాలో నేహాశెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. అయితే స్టేజ్‌పైనే అంజలితో దురుసుగా ప్రవర్తించారు బాలకృష్ణ. స్టేజ్‌పైన అందరూ చూస్తుండగానే అంజలిని పక్కకు తోసేశారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంజలి మాత్రం నవ్వుతూ ఈ ఘటనను కవర్ చేశారు. ఇక స్టేజ్‌పైనే మద్యం సేవించారు బాలకృష్ణ. ఓ వాటర్‌ బాటిల్‌లో మద్యం కనిపించింది.

బాలకృష్ణ వ్యవహారశైలి వివాదాస్పదం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ బాలకృష్ణ హీరోయిన్లతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది సీనియర్ హీరోయిన్లు సైతం ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో బాలకృష్ణపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఫ్యాన్స్‌పైన బాలయ్య చేయి చేసుకున్న ఘటనలు కోకొల్లలు.

First Published:  29 May 2024 9:25 AM GMT
Next Story