Telugu Global
Andhra Pradesh

టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.11కోట్ల విరాళం

టీటీడీ దేవస్థానంలోని శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు ముంబయి చెందిన భక్తుడు రూ.11 కోట్ల విరాళం ఇచ్చారు.

టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.11కోట్ల విరాళం
X

టీటీడీ దేవస్థానంలోని శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు ఇవాళ ఓ భక్తుడు భారీ అందించాడు. ముంబయిలోని ప్రసిద్ యునో ఫ్యామిలీ ట్రస్టుకు చెందిన తుషార్‌ కుమార్‌ అనే భక్తుడు రూ.11 కోట్ల విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరికి అందజేశారు. అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందజేసిన భక్తుడు తుషార్‌ కుమార్‌ను ఆయన అభినందించారు. రేపటి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో మే నెల టీటీడీ దర్శన టికెట్లు విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనుంది. అలాగే 21వ తేది ఉదయం ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు.

ఇక మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేస్తారు.అలాగే 22వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టిక్కెట్లు విడుదల చేస్తే.. 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేస్తుంది టీటీడీ. ఇక మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనుండగా.. 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాకు సంబంధించిన టికెట్లు టీటీడీ విడుదల చేస్తుంది.

First Published:  17 Feb 2025 4:41 PM IST
Next Story