Telugu Global
Andhra Pradesh

మీదెంత బూతుపురాణమో.. జగన్‌ను అంటావా లోకేష్‌..?

మహిళల గురించి నారా లోకేష్‌, బాలయ్య మాట్లాడితే నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి అంటున్నారు కొంద‌రు వైసీపీ నేత‌లు.

మీదెంత బూతుపురాణమో.. జగన్‌ను అంటావా లోకేష్‌..?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సొంత చెల్లిపైనే పేటీఎం కుక్కలతో జగన్‌ దాడి అంటూ మాట్లాడాడు. షర్మిల, సునీతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిందెవరో ఇప్పటికైనా లోకేష్‌కు తెలిసిందా..? రవీంద్రారెడ్డి అనే పేరుతో ఓ ఫేక్‌ అకౌంట్‌ సృష్టించి పినపాల ఉదయ్‌ భూషణ్‌ అనే వ్యక్తి అసభ్యకరమైన పోస్టులు పెట్టాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంతకీ ఆ ఉదయ్‌ భూషణ్‌ అనే వ్యక్తి టీడీపీ వీరాభిమాని అనే విషయాన్ని లోకేష్‌ తెలుసుకున్నాడా..?

గతంలో షర్మిలపై అసభ్యకరమైన పోస్టులను తన మామ బాలయ్య ఇంటి నుంచే పెట్టించారని తెలంగాణ పోలీసుల విచారణలో తేలిన విషయాన్ని నారా లోకేష్‌ మరిచిపోయినట్లే ఉన్నాడు. ఎన్టీఆర్‌ నుంచి లోకేష్‌ తండ్రి చంద్ర‌బాబు సీఎం కుర్చీని, టీడీపీ గుర్తును ఎలా లాక్కున్నాడో ప్రపంచానికంతా తెలుసు.

మహిళల గురించి నారా లోకేష్‌, బాలయ్య మాట్లాడితే నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి అంటున్నారు కొంద‌రు వైసీపీ నేత‌లు. ‘కోడలు పిల్ల మగ పిల్లాడిని కంటానంటే ఏ అత్తయినా వద్దంటుందా అని చంద్రబాబు మహిళలను కించపరిచాడు. కాపు ఉద్యమం చేస్తున్న ముద్రగడను వేధించేందుకు ఆయన భార్యను, కోడలిని పోలీసుల చేత రాయ‌లేని భాష‌లో తిట్టించింది నారా లోకేషేనని ముద్రగడ స్వయంగా చెప్పారు.

‘ఆడది కనపడితే ముద్దు అయినా పెట్టాలి లేదా కడుపు అయినా చేయాలి’ అని బాలకృష్ణ అనడం నారా లోకేష్‌కు గుర్తు లేదా? మహిళల రక్షణ కోసం జగన్‌ దిశ యాప్‌ను రూపొందిస్తే నారా లోకేష్‌ దిశ ప్రతులను తగులబెట్టాడు. కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ నడిపి పేద మహిళల మానప్రాణాలను టీడీపీ హరించింది.

మహిళల పట్ల నారా లోకేష్‌, ఆయన మామ బాలకృష్ణ, తండ్రి చంద్రబాబులకు ఎంత గౌరవం ఉందో పై సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఏ మాత్రం సంస్కారం లేని వారికి మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది..? అని ప్ర‌శ్నిస్తున్నారు.

First Published:  17 Feb 2024 11:40 AM IST
Next Story