పెమ్మసాని.. మరో గల్లా జయదేవ్ కారని గ్యారంటీ ఏంటి?
కమ్మ సామాజికవర్గం ఓట్లు బలంగా ఉండే ఈ నియోజకవర్గంలో గల్లా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా మీద ఒకసారి కాస్త గట్టిగా మాట్లాడటం మినహా గత పదేళ్లలో ఎంపీగా ఆయన పనితీరు గుండు సున్నా.
రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా గుంటూరు. అదేం దౌర్భాగ్యమో కానీ.. ఎంతో మంది దిగ్గజ నేతల్ని కన్న గుంటూరు గడ్డకు గత పదేళ్లుగా ఇంపోర్టెడ్ లీడర్లే ఎంపీలయి కూర్చున్నారు. ఇక ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ అయితే పూర్తిగా ఎన్ఆర్ఐ. ఎన్నారై అంటే సాదాసీదా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుకుంటున్నారేమో.. కానే కాదు అఫిడవిట్ల లెక్కల ప్రకారం దేశంలోనే అత్యంత కాస్ట్‌లీ ఎంపీ అభ్యర్థి.
రూ.5,700 కోట్ల ఆస్తులతో అలరారుతున్న పెమ్మసాని గెలిస్తే గుంటూరు ప్రజలకు సేవ చేస్తారన్న నమ్మకం ఏ కోశానా లేదు. ఇండియాలో వ్యాపారాలున్న గల్లా జయదేవ్‌ను గెలిపిస్తేనే గత పదేళ్లలో ఆయన చుట్టపుచూపుగా వచ్చిపోయారు తప్పి గుంటూరు బాగోగులు చూసిందేమీ లేదు. అలాంటిది విదేశాల్లో వేల కోట్ల వ్యాపారాలున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ను గెలిపిస్తే.. అంతకు మించి కారన్న గ్యారంటీ ఏంటని టీడీపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి.
గల్లా.. గప్‌చుప్
రాష్ట్ర విభజన తర్వా త జరిగిన రెండు జనరల్ ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచారు. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన ఆయన్ను గుంటూరు ప్రాంతానికి చెందిన సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, కొత్త సూపర్ స్టార్ మహేష్‌బాబు బావగా ప్రజంట్ చేసి, టీడీపీ రేసులోకి తీసుకొచ్చింది. కమ్మ సామాజికవర్గం ఓట్లు బలంగా ఉండే ఈ నియోజకవర్గంలో గల్లా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా మీద ఒకసారి కాస్త గట్టిగా మాట్లాడటం మినహా గత పదేళ్లలో ఎంపీగా ఆయన పనితీరు గుండు సున్నా. ఎంపీగా గెలిపిస్తే తన పరిశ్రమలే గుంటూరు చుట్టుపక్కల పెట్టి యువతకు ఉపాధి చూపిస్తానన్న గల్లా మాటలు నీటిమీద రాతలయ్యాయి.
పెమ్మసాని.. ఆ మాటా చెప్పట్లేదుగా
కనీసం గల్లా ఇక్కడి వారికి ఉపాధి కోసం పరిశ్రమలు పెడతానన్నా చెప్పారు. కానీ ప్రస్తుత టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆ మాటా అనట్లేదు. తనకు వేల కోట్ల రూపాయల వ్యాపారాలున్నా గుంటూరు నియోజకవర్గంలోని యువతకు ఏదైనా ఉపాధి అవకాశాలు చూపిస్తానన్న మాట చెప్పట్లేదు. పైగా వీధి రౌడీలాగా చేతులు నరికేస్తా, కాళ్లు తీసేస్తా అంటూ రెచ్చిపోతున్నారు. గల్లా జయదేవ్ పనులు చేయకపోయినా కనీసం డిగ్నిటీగా ప్రవర్తించారు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఆ డిగ్నిటీ కూడా లేదని టీడీపీ నేతలే చిరాకుపడుతున్నారు.