జగన్‌పై అసంతృప్తి. డీఎల్ చెప్పిన కీలక కారణం
2010 నుంచి జెండా మోసిన తమకు ఆదాయం, అధికారం రెండూ లేకుండా అన్ని జగనే తీసుకోవడంతో నేతల్లో అసంతృప్తి ఉందన్నారు. డీఎల్ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే.. దోచుకునేందుకు అవకాశం ఇవ్వలేదన్న బాధ ఉన్నవారే వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారన్నమాట.
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలకమైన కారణం చెప్పారు. పరోక్షంగా దోచుకునేందుకు జగన్ పాలనలో అవకాశం లేదని తేల్చేశారు.
ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన డీఎల్.. ఎమ్మెల్యేల్లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నేతల్లోనూ అసంతృప్తి ఉందన్నారు. జగన్ సీఎం అయితే తాము రాష్ట్రాన్ని ఏలుకోవచ్చని ద్వితీయ శ్రేణి నాయకులు భావించారని.. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు అధికారం, ఆదాయం రెండూ లేకుండాపోయాయన్నారు. ఆదాయం మొత్తం జగన్‌కే వెళ్తుండటాన్ని కూడా నాయకులు గమనిస్తున్నారని చెప్పారు.