గరికపాటి-చిరు ఎపిసోడ్.. మళ్లీ కెలికిన వర్మ
పరిస్థితి చక్కబడి ఈ వివాదం సమసిపోతున్న సమయంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ కెలికాడు. ఎప్పుడూ మెగా హీరోలకు వ్యతిరేకంగా ట్వీట్లు వేసే వర్మ ఈసారి చిరంజీవికి మద్దతుగా వరుస ట్వీట్లు వేశాడు.
నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో గరికపాటి నరసింహారావు ప్రవచనాలు చేస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులతో ఫొటోలు దిగుతుండటంతో ఆయనపై గరికపాటి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి సోదరుడు నాగబాబు గరికపాటిపై విమర్శలు చేశారు. ఆ తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గరికపాటిని ట్రోల్స్ చేశారు.
ఐ యాం సారీ @NagaBabuOffi గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో @KChiruTweets ని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, *త్తగ్గేదెలె...* https://t.co/hyJ8ORvA6N
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
ఈ విమర్శల దాడి తీవ్రమవ్వడంతో నాగబాబు కల్పించుకుని అభిమానులకు సర్ది చెప్పారు. ఇంతటితో ఈ టాపిక్ వదిలేయాలని గరికపాటిని విమర్శించవద్దని కోరారు. పరిస్థితి చక్కబడి ఈ వివాదం సమసిపోతున్న సమయంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ కెలికాడు. ఎప్పుడూ మెగా హీరోలకు వ్యతిరేకంగా ట్వీట్లు వేసే వర్మ ఈసారి చిరంజీవికి మద్దతుగా వరుస ట్వీట్లు వేశాడు. అతడి తీరు చూస్తుంటే సమసి పోయిన వివాదాన్ని మళ్లీ రేపినట్లుగా ఉందే కానీ చిరంజీవికి మద్దతుగా అనిపించలేదు.
సర్ @NagaBabuOffl గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
మెగాస్టార్ ని అవమానించిన గుర్రంపాటిని క్షమించే ప్రసక్తే లేదని, మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించినవాడు మాకు గ(డ్డిప)రకతో సమానమని వర్మ ట్వీట్ చేశాడు. పబ్లిసిటీ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగవద్దని, మెగాస్టార్ చిరంజీవి ఏనుగు అని.. నువ్వేంటో నీకు తెలివి ఉందని అనుకుంటున్నావు కాబట్టి నువ్వే తెలుసుకో.. అని వర్మ ట్వీట్ చేశారు. గరికపాటి- చిరంజీవి వ్యవహారంపై వర్మ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.