లింకన్‌తో నీకు పోలికేంటి పవన్?
పవన్ కళ్యాణ్ తన ఓటమిని సమర్థించుకోవడానికి అబ్రహం లింకన్ ప్రస్తావని తీసుకురావడం సమంజసంగా లేదన్నాడు. పవన్ లా లింకన్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పే ప్రయత్నం అతకలేదన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సెటైర్లు వేశాడు. పవన్ తన ఓటమిని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఓటమితో పోల్చడంపై వర్మ మండిపడ్డాడు. అబ్రహం లింకన్ గురించి ఎవరికీ తెలియని సమయంలో ఆయన ఓడిపోయారని.. నువ్వు సూపర్ స్టార్ అయి ఉండి ఎన్నికల్లో ఓడిపోయావని ట్విట్టర్ వేదికగా పవన్ పై వర్మ సెటైర్ వేశాడు.
పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. గురువారం విశాఖలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ తన ఓటమి గురించి ప్రస్తావన తెచ్చారు. తన ఓటమికి అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఓటమికి సారూప్యత ఉన్నట్లు చెప్పారు. అమెరికా చరిత్రలో నిలిచిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ కూడా అనేక ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. లింకన్ న్యాయవాద ఎన్నికల్లో, సెనేటర్ ఎన్నికల్లో, గవర్నర్ ఎన్నికల్లో ఓడిపోయినట్లు పవన్ వివరించారు.
కాగా, పవన్ కళ్యాణ్ తన ఓటమిని అబ్రహం లింకన్ ఓటమితో పోల్చడాన్ని రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా విమర్శించాడు. పవన్ కళ్యాణ్ తన ఓటమిని సమర్థించుకోవడానికి అబ్రహం లింకన్ ప్రస్తావని తీసుకురావడం సమంజసంగా లేదన్నాడు. పవన్ లా లింకన్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పే ప్రయత్నం అతకలేదన్నారు.
పవన్ కళ్యాణ్ కు అబ్రహం లింకన్ కు మధ్య సారూప్యత లేనే లేదని వర్మ అన్నాడు. లింకన్ ఆ ఎన్నికల్లో ఓడిపోయే నాటికి ఆయన గురించి ఎవరికీ తెలియదని చెప్పాడు. అప్పటికి ఆయన ఓ సామాన్యమైన వ్యక్తి మాత్రమే అని అన్నాడు. కానీ, పవన్ కళ్యాణ్ అలా కాదని.. ఎన్నికల్లో పోటీ చేసే నాటికే సినిమాల్లో సూపర్ స్టార్ అని అన్నాడు. మీ గురించి అందరికీ తెలిసినా.. ఓడిపోయారని.. అదీ మీకు లింకన్ కు మధ్య ఉన్న తేడా అని వర్మ పవన్ పై సెటైర్లు వేశాడు.