మంత్రికే రక్షణ లేదు.. సామాన్యుల పరిస్థితేంటి -వైసీపీకి ఆర్జీవీ ప్రశ్న
మంత్రి రోజా బ్లూ ఫిల్మ్స్‌లో నటించారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు బండారు సత్యనారాయణ. రోజా వీడియోలు తమ దగ్గర ఉన్నాయంటూ, వాటిని బయటపెడతామంటూ వాగారు.
సోషల్‌మీడియాలో తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ టార్గెట్ చేసే రామ్‌గోపాల్ వర్మ.. తాజాగా వైసీపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఏం అంశంపై అంటారా..! మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత బండారు సత్యనారాయణ.. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపైనే వైసీపీ ప్రభుత్వంతో పాటు వై.ఎస్.జగన్‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ఆర్జీవీ. సిట్టింగ్ మంత్రి రోజా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య మహిళల పరిస్థితి ఏంటన్నారు ఆర్జీవీ. బండారు సత్యనారాయణపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Bandaru Satyanarayana of Telugu Desam party is shouting on a public mike that the present MINISTER for TOURISM of Andhra Pradesh sleeps for money with multiple partners and she acts in porn films ..Watch especially from 1.08 to 2.26 https://t.co/nVo2pLGbIQ if this is not criminal… pic.twitter.com/gCfG01J8jT
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2023
మంత్రి రోజా బ్లూ ఫిల్మ్స్‌లో నటించారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు బండారు సత్యనారాయణ. రోజా వీడియోలు తమ దగ్గర ఉన్నాయంటూ, వాటిని బయటపెడతామంటూ వాగారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన లింక్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఆర్జీవీ.. సాక్షాత్తు మహిళా మంత్రికే ఇంత బహిరంగంగా అవమానం జరిగితే.. ఇంకా సామాన్య మహిళల పరిస్థితేంటంటూ ప్రశ్నించారు. ఇంతకంటే అవమానం మహిళలకు మరొకటి ఉంటుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Dear @ysjagan gaaru if a woman minister in your cabinet has to go through such public humiliation , what can common women expect sir ? https://t.co/nA9v3WGBJP
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2023
ఇక మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు సైతం ప్రశ్నలు సంధించారు ఆర్జీవీ. మంత్రి స్థానంలో ఉన్న మహిళకే ఇలా జరిగితే.. కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ ట్వీట్‌కు సీఎం జగన్‌తో పాటు ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు. ఇదే అంశంపై నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణికి సైతం ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. జాతీయ మహిళా కమిషన్‌తో పాటు దాని ఛైర్ పర్సన్‌ను ట్యాగ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే జాతీయ మహిళా కమిషన్ ఏం చేస్తోందన్నారు ఆర్జీవీ.