Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఏం చేశారో ఎందుకు మరిచారు, రామోజీగారూ...

చంద్రబాబు బాగోతం చేప్పాలంటే చాలానే ఉంది. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే విజయనగరంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణం పేరుతో విశాఖపట్నం పరిసరాల్లోని దేవాదాయ శాఖకు చెందిన 400 ఎకరాలకుపైగా మాన్సాస్‌ ట్రస్టు భూములను అమ్మకానికి పెట్టారు.

చంద్రబాబు ఏం చేశారో ఎందుకు మరిచారు, రామోజీగారూ...
X

వైఎస్‌ జగన్‌ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ కాకిగోల చేస్తున్న ఈనాడు రామోజీరావు తన ముద్దుల శిష్యుడు చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన విధ్వంసం గురించి ఎందుకు మాట్లాడడం లేదు..? జగన్‌పై తప్పుడు రాతలు రాయిస్తూ చంద్రబాబును గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన అంతకన్నా మించి ఏం చేయగలరు..? అయితే, చంద్రబాబు హయాంలో జరిగిన దేవాలయాల విధ్వంసం గురించి కచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే.

టీడీపీ హయాంలో కృష్ణా నది ఒడ్డున పవిత్ర దేవాలయాలను కూల్చివేస్తే రామోజీరావు నోరు కూడా మెదపలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లకు అడ్డంగా ఉన్నాయనే కారణంతో రాత్రికి రాత్రి ఆల‌యాల‌ను నేలమట్టం చేశారు. ఆ కూల్చిన దేవాల‌యాల‌ను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పునర్నిర్మిస్తోంది.

చంద్రబాబు బాగోతం చేప్పాలంటే చాలానే ఉంది. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే విజయనగరంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణం పేరుతో విశాఖపట్నం పరిసరాల్లోని దేవాదాయ శాఖకు చెందిన 400 ఎకరాలకుపైగా మాన్సాస్‌ ట్రస్టు భూములను అమ్మకానికి పెట్టారు. ఐదేళ్లలో 70 ఎకరాలకు పైగా అమ్మేసి వందల కోట్ల రూపాయలను పోగేసుకున్నారు. కాలేజీ నిర్మాణాన్ని మాత్రం గాలికి వదిలేశారు.

చంద్రబాబు హయాంలో విజయవాడలోని దుర్గ గుడిలో క్షుద్రపూజలు చేశారనే దుమారాన్ని ఎలా మరిచిపోతారు..? బెంజ్‌ సర్కిల్‌ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను తనకు సన్నిహితుడైన వ్యక్తికి చెందిన విద్యాసంస్థకు అతి తక్కువ లీజుకు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది.

జగన్‌ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేని విదంగా దేవాదాయశాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాల పునరుద్ధరణను, నూతన ఆలయాల నిర్మాణాలను చేపట్టింది. దానికితోడు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 2,872 ఆలయాల నిర్మాణం జరుగుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఆలయాల భూములను ఆక్రమించుకునేందుకు వీలు లేకుండా జగన్‌ ఓ ఆర్డినెన్స్‌ తెచ్చారు. ఇది దేవాదాయ శాఖ చరిత్రలోనే విప్లవాత్మకమైంది.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చిన్న, పెద్ద ఆలయాలన్నింటికీ టీడీపీ నేతలే ట్రస్టు బాధ్యతల్లో ఉండేవారు. ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ జగన్‌ ప్రభుత్వం ఆయా ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, స్జానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తోంది. దేవాదాయ శాఖ పరిధిలో 25 వేలకు పైగా ఆలయాలు, సత్రాలు ఉన్నాయి. రూ. 5లక్షలకు పైబడి ఆదాయం ఉన్న 1,400 ఆలయాలకు మాత్రమే ప్రభుత్వం ట్రస్టు బోర్డులను నియమిస్తోంది.

దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వివిధ స్వామీజీలు, రిటైర్డ్‌ జడ్జిలు, రిటైర్డ్‌ దేవాదాయ శాఖాధికారులు సభ్యులుగా ఉండే ధార్మిక పరిషత్తుకు వర్తింపజేస్తూ అప్పటి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2009లోనే చట్టం చేసింది. దీంతో ప్రభుత్వ జోక్యం చాలా వరకు తగ్గింది. అయితే, చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో దాని ఏర్పాటును నిర్లక్ష్యం చేశారు. మొక్కుబడిగా కొద్దిమంది తనవారిని నియమించి చేతులు దులుపుకున్నారు.

First Published:  5 Feb 2024 6:57 AM GMT
Next Story