తెలుగుదేశం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ కాదా? మాజీ సీఎం నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసింది తానేనని మాజీముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తెలిపారు. ఎన్టీఆర్ కు ఓ పత్రికాధిపతితో ఉన్న సాన్నిహిత్యం, ఆయనకున్న ప్రజాదరణ, సినీ గ్లామర్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన్నే పార్టీ అధ్యక్షుడిగా చేశామని చెప్పారు. ఆతర్వాత పార్టీని ఎన్టీఆర్ గుంజుకున్నారని నాదెండ్ల ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుది కాదా.. మొదట్నుంచీ ఆ పార్టీని ఎవరో ఒకరు గుంజుకుంటూ వచ్చారా..మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అవుననే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాదని, ఆ పార్టీ తన మానస పుత్రిక అని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ వచ్చి చేరాడు అని చెప్పారు. అంజయ్య కేబినెట్ లో మంత్రిగా పని చేసిన భాస్కరరావు అసంతృప్తితో బయటికి వచ్చారు. అప్పుడే ఆయన సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం లభించడంలేదనే అసంతృప్తి ఆయనలో ఉండేదట. దాంతో ఆయన కేబినెట్ నుంచి బయటికి వచ్చి కమ్మ సామాజిక నేతలను కొందరు ఎమ్మెల్యేలను కలుపుకుని తెలుగుదేశం పేరిట పార్టీ పేట్టాలని ఆలోచించి అన్నీ సిద్ధం చేసుకున్నామని భాస్కరరావు ఒక యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆ సమయలో ఎన్టీఆర్ తన వద్దకు వచ్చారని, వయసు రీత్యా ఆయన తనకంటేపెద్దవాడవడం వల్ల గౌరవించి కుర్చీలో కూర్చోబెట్టి పక్కన తాను కూర్చున్నానని గుర్తు చేసుకున్నారు. ఇలా రాకపోకలు సాగుతుండగా తాను రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షను రామారావు వెల్లడించారని చెప్పారు. ఆయన సీనీ గ్లామరు పార్టికి ఉపయోగపడుతుందని భావించి ఆయనను పార్టీలోకి తీసుకున్నానని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా ఆయన ఒక పత్రికాధిపతితో సన్నిహితం పెంచుకున్నారని చెప్పారు. ఎన్టీర్ కు ఉన్న ప్రజాదరణ, సినీ గ్లామర్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన్నే పార్టీ అధ్యక్షుడిగా చేశామని చెప్పారు.
అయితే క్రమంగా ఆ పార్టీ ఆయనదేనన్న కలర్ వచ్చిందన్నారు.సరే.. ఏదైతేనేమిలే మన సామాజిక వర్గానికి ప్రాధాన్యం లభిస్తుంది కదా అని సరిపెట్టుకున్నామని చెప్పారు. అంటే భాస్కరరావు కథనం ప్రకారం తెలుగుదేశం పార్టీ తొలినాళ్ళ నుంచీ ఆక్రమణలు, గుంజుకొనుడుకే అలవాటుపడిందన్న మాట అంటున్నారు. టిడిపి ఎన్టీఆర్ హయాం తర్వాత మళ్ళీ ఆక్రమణకు గురవడం చంద్రబాబు రంగంలోక దిగడం ఆయన్నుంచి పార్టీని గుంజుకోవడం ఆ తర్వాత కథ అంతా తెలిసిందే.
చివరికి ఎన్టీఆర్ పోరాడినా తమదే అసలైన టిడిపి అని చం ద్రబాబు నిరూపించుకోవడం, ఎన్టీఆర్ మనో వ్యథకు గురవడం అనంతరం కాలం చేయడం తెలిసిందే. ఇక అప్పటినుంచీ చంద్రబాబు చేతుల్లోనే ఆ పార్టీ నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో మరో సారి తెలుగుదేశం పార్టీ లో ఏం జరగబోతోందనే వాదన కూడా వినిపిస్తుంటుంది. ఎవరు దీనిని ఎగరేసుకుపోతారోననే చర్చ సాగుతోంది. అంటే ఎవరో వస్తారని ఇప్పటికే కొందరిలో కొన్ని ఆశలు ఉన్నాయి.