Telugu Global
Andhra Pradesh

డైమండ్ రాణి – ఇస్పేట్ రాజా.. చల్లారని వివాదం

భోగి పండగ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా.. మరోసారి పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్‌ జోకర్ అన్నారు.

డైమండ్ రాణి – ఇస్పేట్ రాజా.. చల్లారని వివాదం
X

రణస్థలం సభలో పవన్ కల్యాణ్ ఆవేశపూరిత ప్రసంగంలో డైమండ్ రాణి అనే పదం సంచలనంగా మారింది. మంత్రి రోజాను ఆయన డైమండ్ రాణిగా అభివర్ణిస్తూ సెటైరిక్ గా మాట్లాడారు. అప్పటికప్పుడు ఆ వ్యవహారంపై రోజా కూడా స్పందించారు. రెండు సార్లు గెలిచినే నేను, రెండుచోట్ల ఓడిపోయిన నీతో మాటలు పడటమా.. తూ.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక మహిళను, అందులోనూ మంత్రిని డైమండ్ రాణి అంటూ పవన్ వెటకారం చేయడాన్ని మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. అయితే ఈఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోలేదు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరింత హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది.

ఉత్తరాంధ్ర వలసలపై పవన్ వ్యాఖ్యలను విమర్శిస్తూ మంత్రి రోజా ఇచ్చిన కౌంటర్ కు నాగబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మళ్లీ డైమండ్ రాణి అనే పదాన్ని తెరపైకి తెచ్చారు. బ్రెయిన్ లెస్ సెన్స్ లెస్ డైమండ్ రాణి అంటూ ఆయన ట్వీట్ చేశారు.


ఇక్కడితో అయిపోలేదు, ఇటు వైసీపీ బ్యాచ్ నుంచి కూడా ఈ పదం పదే పదే తెరపైకి వస్తోంది. రామ్ గోపాల్ వర్మ, మంత్రి రోజాకి మద్దతుగా ట్వీట్ వేశారు. “డైమండ్ రాణి అనే బిరుదుతో ఒకావిడని కించపరిచిన వ్యక్తికి తనుకూడా ఒక ఇస్పేట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం ఉండాలి అని ఒక “పి” ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను”. అంటూ పవన్ కల్యాణ్ ని విమర్శిస్తూ కౌంటర్ ఇచ్చారు వర్మ. పవన్ ని ఇస్పేట్ రాజా అంటూ కామెంట్ చేశారు.


ఫైనల్ గా రోజా..

భోగి పండగ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా.. మరోసారి పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్‌ జోకర్ అన్నారు. జగన్ లా తాను పోటీ చేయలేను.. తనకు చేతకాదు అని పవన్ కళ్యాణ్ ఒప్పేసుకున్నారని ఎద్దేవా చేశారు. అదీ జగన్ పవరంటే అని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టలేనని నిస్సహాయత వ్యక్తం చేసిన పవన్ ప్యాకేజీతో సరిపెట్టుకున్నారని విమర్శించారు. సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య కలెక్షన్లు వచ్చాయని, బాలయ్య వీరసింహారెడ్డి కూడా కలెక్షన్లు వచ్చాయని, సినిమా చేయకపోయినా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నుండి కలెక్షన్లు అందాయని వెటకారం చేశారు. కానీ జనసేన నాయకులే ఏమీ లేకుండా పోయారని సానుభూతి చూపించారు.

First Published:  14 Jan 2023 8:46 AM IST
Next Story