Telugu Global
Andhra Pradesh

ఏపీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ధీరజ్‌సింగ్ ఠాకూర్‌

జ‌స్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియ‌మించాల‌ని జూలై 5న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది.

ఏపీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ధీరజ్‌సింగ్ ఠాకూర్‌
X

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్ నియామ‌కం కోసం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. జస్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్ ప్ర‌స్తుతం బాంబే హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్నారు.

జ‌స్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియ‌మించాల‌ని జూలై 5న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. ప్ర‌స్తుతం ఏపీ హైకోర్టు తాత్కాలిక‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఆకుల వెంక‌ట శేష‌సాయి కొన‌సాగుతున్నారు.

First Published:  25 July 2023 8:45 AM IST
Next Story