Telugu Global
Andhra Pradesh

నీకు ముప్పంటూ ఉంటే చంద్ర‌బాబు నుంచే ఉంటుంది

త‌మ్ముడూ ప‌వ‌న్ క‌ల్యాణ్ నువ్వు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. నీకు ఏమైనా జ‌రిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద‌కే వ‌స్తుందని చంద్ర‌బాబుకు బాగా తెలుసు అని కొట్టు స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.

నీకు ముప్పంటూ ఉంటే చంద్ర‌బాబు నుంచే ఉంటుంది
X

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ముప్పంటూ ఉంటే అది ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నుంచే ఉంటుంద‌ని ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, సుపారీ ఇచ్చి త‌న‌పై హ‌త్యాయ‌త్నం చేస్తున్నారంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ ఆదివారం స్పందించారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ల్యాణ్ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

త‌మ్ముడూ ప‌వ‌న్ క‌ల్యాణ్ నువ్వు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. నీకు ఏమైనా జ‌రిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద‌కే వ‌స్తుందని చంద్ర‌బాబుకు బాగా తెలుసు అని కొట్టు స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. ప‌వ‌న్‌పై హ‌త్యాయ‌త్నం లాంటిదేదైనా జ‌రిగితే చంద్ర‌బాబు నుంచే జ‌రుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రంగా మీద కూడా ఇదేవిధంగా చేశార‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ గుర్తుచేశారు. త‌మ్ముడూ ప‌వ‌న్.. ద‌య‌చేసి నువ్వు జాగ్ర‌త్త‌గా ఉండు.. చంద్ర‌బాబుపై ఒక క‌న్నేసి ఉంచు అని ఆయ‌న హిత‌వు ప‌లికారు.

First Published:  18 Jun 2023 6:24 PM IST
Next Story