వైసీపీలో మొదటి వికెట్ పడిందా?
ఈడీ దర్యాప్తుకు రాఘవ ఇప్పటికే రెండు సార్లు హాజరయ్యారు. అయితే హఠాత్తుగా శనివారం ఉదయం ఈడీ అరెస్టు చేయటం పార్టీలో సంచలనంగా మారింది. స్కామ్ లిక్కర్‌కు సంబంధించినదే అయినప్పటికీ ఇందులో మనీ ల్యాండరింగ్ వ్యవహారం కూడా ఉందని దర్యాప్తు సంస్థలు మొదటి నుండి అనుమానిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీకి సంబంధించి మొదటి వికెట్ పడింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ దాఖలుచేసిన చార్జిషీట్లలో ఎంపీ శ్రీనివాసులరెడ్డి పేరు కూడా ఉంది. అయితే ప్రత్యక్షంగా ఎంపీకి స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తు సంస్థలకు అర్థమైందట. మొదటి నుండి ఆయన కొడుకు రాఘవ పేరే స్కామ్‌లో వినబడుతోంది. స్కామ్‌కు సంబంధించి సీబీఐతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈడీ దర్యాప్తుకు రాఘవ ఇప్పటికే రెండు సార్లు హాజరయ్యారు. అయితే హఠాత్తుగా శనివారం ఉదయం ఈడీ అరెస్టు చేయటం పార్టీలో సంచలనంగా మారింది. స్కామ్ లిక్కర్‌కు సంబంధించినదే అయినప్పటికీ ఇందులో మనీ ల్యాండరింగ్ వ్యవహారం కూడా ఉందని దర్యాప్తు సంస్థలు మొదటి నుండి అనుమానిస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ చాలాసార్లే చెప్పారు. తమ కుటుంబం 70 ఏళ్ళుగా లిక్కర్ వ్యాపారంలో ఉన్నప్పటికీ ఢిల్లీలో మాత్రం వ్యాపారం చేయటంలేదని చెప్పారు.
అయితే లిక్కర్ స్కామ్‌లోనే ఇప్పుడు ఈడీ అరెస్టు చేసిందంటే ఇందులో మనీ ల్యాండరింగ్ కోణంలోనే అరెస్టు చేసిందని సమాచారం. చార్జిషీటులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్ కుమార్తె కవిత, అరబిందో ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డి లాంటి ప్రముఖుల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. వీరిలో కొందరిని అరెస్టు చేస్తే మరికొందరిని విచారిస్తున్నాయి.
మాగుంట రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో తండ్రికి బదులుగా ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాఘవరెడ్డి అరెస్టు పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇదే విషయమై ఎంపీ మాట్లాడుతూ తమ ఇంటిపేరున్న దగ్గరి బంధువులకు ఢిల్లీలో కొన్ని లిక్కర్ షాపులున్నాయి కానీ తమకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. తాజాగా అరెస్టయిన రాఘవరెడ్డిని ఈడీ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచబోతోంది.