Telugu Global
Andhra Pradesh

బాబులో ఓటమి టెన్షన్.. స్పీచుల్లో ఫ్రస్ట్రేషన్

జగన్‌పై దాడులు చేయాలంటూ మొదలైన బాబు ప్రసంగాలు.. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది మరింత దిగజారుతున్నాయి. 14 ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన వయస్సు, హోదా మరిచి నీచస్థాయికి దిగజారారు.

బాబులో ఓటమి టెన్షన్.. స్పీచుల్లో ఫ్రస్ట్రేషన్
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఓటమి భ‌యం పట్టుకుంది. ఆయన స్పీచులే దీనికి అద్దం పడుతున్నాయి. ఎన్నికలకు మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉండడం, జగన్‌పై తాను చేస్తున్న విమర్శలు, తప్పుడు ఆరోపణలు ప్రజలు నమ్మకపోవడంతో ఆయన ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. దీంతో రోజురోజుకూ దిగజారుతున్నారు.


జగన్‌పై దాడులు చేయాలంటూ మొదలైన బాబు ప్రసంగాలు.. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది మరింత దిగజారుతున్నాయి. 14 ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన వయస్సు, హోదా మరిచి నీచస్థాయికి దిగజారారు. జగన్‌తో పాటు ఆయన కుటుంబాన్ని నానమ్మ, తాతయ్య, అమ్మమ్మలను దూషిస్తున్నారు చంద్రబాబు. ఓటమిని తప్పించుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్‌పై అవినీతి ఆరోపణలు, ఫేక్ ప్రచారాలు చేశారు. పెన్షన్లు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై బాబు అండ్‌ కో చేసిన విష ప్రచారం తిరిగి వారి మెడకే చుట్టుకుంది. వీటిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ ప్రయత్నాలన్ని విఫలం కావడంతోనే ఇక చంద్రబాబు తన నోటికి పని చెప్తున్నారు.

చంద్రబాబు ఏమన్నారంటే..!

సోమవారం అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఈ సభకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. మోడీ ఉన్నంతవరకు నక్క వినయాన్ని ప్రదర్శించిన చంద్రబాబు.. ఆయన వెళ్లిపోగానే బూతులతో తన నోటిని కడిగేసుకున్నారు. జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై రెచ్చిపోయి బూతులకు దిగారు. జగనన్న భూ హక్కు అంట.. నీ తల్లి మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, నీ నానమ్మ మొగుడిచ్చాడా, నీ జేజ తాతిచ్చాడా.. ఎవడిచ్చాడు అంటూ వినేవారికి సైతం కంపరం పుట్టించేలా మాట్లాడారు. అంతకుముందు జరిగిన సభల్లోనూ చంద్రబాబు తన అసహనాన్ని బయటపెట్టారు. జగన్‌పై దాడులు చేయాలని పిలుపునిచ్చారు.

కాగా, చంద్రబాబు తిట్ల పురాణం ఈసీకి కనపడకపోవడం గమనార్హం. బహిరంగ వేదికలపైనే చంద్రబాబు దాడులు చేయాలని పిలుపునిస్తున్నా ఈసీ మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి విమర్శిస్తే రెండు రోజులు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.

First Published:  7 May 2024 9:23 AM IST
Next Story