జైభీమ్ పార్టీలో చేరిన దస్తగిరి.. జగన్‌పై పోటీ చేయడానికేనట..!
జగన్‌పై పులివెందులలో పోటీ చేస్తానని దస్తగిరి ఇంతకు ముందే ప్రకటించారు. ఏదో ఒక పార్టీ అండ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయన జై భీమ్ భారత్ పార్టీలో చేరారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, అప్రూవర్‌గా మారిన దస్తగిరి జైభీమ్ భారత్ పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్ దస్తగిరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ వెంటనే పులివెందులలో జగన్‌పై దస్తగిరి పోటీ చేస్తారని ప్రకటించారు.
జగన్‌ను ఢీ కొంటారట!
జగన్‌పై పులివెందులలో పోటీ చేస్తానని దస్తగిరి ఇంతకు ముందే ప్రకటించారు. ఏదో ఒక పార్టీ అండ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయన జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. వివిధ అంశాల్లో జగన్‌పై విమర్శలు గుప్పించే శ్రవణ్‌కుమార్ పార్టీలో దస్తగిరి చేరడం గమనార్హం.
టీడీపీ ప్లానేనా?
పులివెందులలో రకరకాల కేసుల్లో ఇరుక్కున్న దస్తగిరి ఈ ఎన్నికల్లో జగన్‌పై పోటీ చేస్తే వివేకా హత్య గురించి ఏదో రకంగా ప్రచారంలోకి తెచ్చి లబ్ధి పొందాలనేది టీడీపీ దురాలోచన అని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే నేరుగా టీడీపీలో చేరదామంటే అక్కడ ఆల్రెడీ బీటెక్ రవికి టికెట్ ఇచ్చారు. అదీకాక నేరుగా తమ పార్టీలో చేర్చుకుంటే టీడీపీ కావాలనే జగన్‌పై దుష్ప్రచారానికి దస్తగిరిని వాడుకుంటుందని అందరికీ తెలిసిపోతుంది. అందుకే తమ అనుబంధ పార్టీలాంటి జై భీమ్ పార్టీలోకి పంపి, అక్కడి నుంచి పోటీ చేయించబోతున్నారని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఎంతమంది బీటెక్ రవిలు, దస్తగిరిలు వచ్చినా పులివెందులలో జగన్‌ను ఓడించడం కలేనని వైసీపీ వర్గాలు తేల్చిచెబుతున్నాయి.