మంత్రి విడదల రజని మహిళా ద్రోహిగా మిగిలిపోతారు.. సీపీఐ నారాయణ
తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిని తరలించడాన్ని సీపీఐ నేత నారాయణ తప్పుబట్టారు. ఆదేశాలు రాకముందే తరలించే ప్రయత్నం చేయడాన్ని ఖండించిన ఆయన మంత్రి విడదల రజని మహిళా ద్రోహిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.
BY Telugu Global16 Aug 2022 1:43 PM IST

X
Telugu Global Updated On: 16 Aug 2022 1:47 PM IST
తిరుపతిలో ప్రసూతి ఆసుపత్రి తరలింపు వివాదాస్పదంగా మారుతోంది. హాస్పిటల్ లో రోగులు ఉన్నా నగర పాలక సంస్థ నుంచి ఆదేశాలు రాకముందే ఆసుపత్రి పై బోర్డును మార్చేయడాన్ని సీపీఐ నేతలు ఖండిస్తున్నారు. ఇంత అర్జంట్ ఏమిటంటూ కొత్తగా పెట్టిన బోర్డును వారు ధ్వంసం చేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో సీపీఐ నారాయణ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ.. ఏపీ మంత్రి విడదల రజని మహిళా ద్రోహిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ఈ ఆసుపత్రిలో పేషంట్స్ ఉన్నప్పటికీ హడావుడిగా కొత్త బోర్డును ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. మొదట రోగుల పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు.
Next Story